సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊరు వాడ  పూర్తిగా పండుగ శోభను సంతరించుకుంటాయని.. ఎక్కడ చూసినా...  రంగురంగుల రంగవల్లులు... గొబ్బెమ్మలు..  సాంప్రదాయ వస్త్రధారణలో తెలుగింటి ఆడపడుచులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే అటు బుల్లితెరపై కూడా ఎన్నో కార్యక్రమాలు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఈ టీవీ యాజమాన్యం ప్రతి పండుగకు ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ కి  కూడా ఓ సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేసింది ఈ టీవీ యాజమాన్యం.



 అత్తో అత్తమ్మ కూతురో అనే టైటిల్ తో  సంక్రాంతి ఈవెంట్ ప్లాన్ చేసింది. ఇక ఈ ప్రోగ్రాం కి సంబంధించి వరుసగా ప్రోమోలు సోషల్ మీడియా లో విడుదల చేస్తున్న ఈ టీవీ యాజమాన్యం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల అందరిలో ఈ షో పై మరింత అంచనాలను పెంచుతుంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించి విడుదలైన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇక ఇటీవలే మరో ప్రోమో  విడుదలై అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ప్రోమో ప్రారంభంలోనే ఈవెంట్ లో పాల్గొన్న మహిళలు అందరూ కూడా రంగురంగుల రంగవల్లులతో అలరించారు.



 అయితే ఇటీవలే విడుదలైన ప్రోమోలో  హైపర్ ఆది  డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.  ఇక ఈ ప్రోమో లో హైపర్ ఆది పర్ఫామెన్స్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ ఈవెంట్లో జడ్జిగా వచ్చిన రోజా... హైపర్ ఆది భార్య పాత్రలో వచ్చిన అనసూయ ఇద్దరితో కలిసి అత్తో అత్తమ్మ కూతురో అనే సాంగ్ పై డాన్స్  చేశాడు హైపర్ ఆది. అంతేకాదు ఎప్పుడు డాన్స్ చేయడానికి ఇబ్బంది పడే హైపర్ ఆది ఇటీవలే విడుదలైన ప్రోమోలో  మాత్రం అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో అందరిని ఆశ్చర్య పరిచాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: