వైవిధ్య భరితమైన పాత్రలను ఎన్నుకోవడం లోనూ, వాటిని రక్తి కట్టించడంలోనూ విజయ్ సేతుపతి పెట్టింది పేరు.. ఇక సీనియర్ కథానాయకుల విషయానికొస్తే భారత సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక పాత్రలు చేసి విమర్శకుల ప్రశంసలు పొందే గొప్ప కథానాయకుడు కమల్ హాసన్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కమల్ రేంజ్ లో పాత్రను పండించడం అంటే కష్టమే...ఇప్పుడు అదే తరహాలో కమల్ బాటలో నడుస్తున్నారు యంగ్ తమిళ హీరో విజయ్ సేతుపతి. ఇప్పటికే ఎన్నో వైవిధ్యభరిత సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు పొందిన విజయ్ సేతుపతి ఇప్పుడు మరో అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రంతో మన ముందుకు రానున్నారట.

ఈ సంతోషకరమైన విషయాన్ని స్వయంగా విజయ్ సేతుపతి వెల్లడించారు. 34 ఏళ్ల క్రితం క‌మ‌ల్ హాస‌న్ చేసిన ప్ర‌యోగాన్ని ఇప్పుడు విజ‌య్ ట్రై చేయడానికి రెడీ అయ్యారు. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ప్రయోగాత్మక బాటలో పరుగులు తీస్తున్నారు విజయ్. నిన్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల కోసం అద్భుతమైన ప్రకటన చేశాడు ఈ  హీరో. తను చేయ బోతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం గురించి కీలక ప్రకటన చేశారు విజయ్. "గాంధీ టాక్స్" అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. కిశోర్ పాండురంగ్ బెలెక‌ర్  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మూవీ మిల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.

దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది ఒక సైలెంట్ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌రాఠీ భాష‌ల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో మరో ప్రయోగాత్మక పాత్రలో మన ముందుకు రానున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును  తీసుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: