మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా రౌద్రం రణం రుధిరం. దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్న విషయం తెలిసిందే. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీకి ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ కె.కె.సెంథిల్కుమార్ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.  

పేట్రియాటిక్ మూవీగా 1920 ల కాలం నాటి కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆలియా భట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కి సంబంధించిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇటీవల ప్రారంభమైంది. కాగా వీలైనంత త్వరగా సినిమాని ముగించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించాలని మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుందట. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు హీరో లిద్దరి ఫస్ట్ లుక్ టీజర్లు మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. అదే సినిమా సక్సెస్ పై పలువురు ప్రేక్షకాభిమానులకు పలు సందేహాలు కలిగేలా చేస్తోంది. నిజానికి గతేడాది జూలై 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది జనవరి 8 కి వాయిదా పడింది. అయితే మధ్యలో కరోనా కారణంగా షూటింగ్స్ అన్ని నిలిపివేయడంతో మూవీ ని మరొకసారి వాయిదా వేసారు. పక్కాగా ఆర్ఆర్ఆర్ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అనే దానిపై మాత్రం ఇప్పటివరకు యూనిట్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.

ఇక కొద్ది రోజుల నుంచి పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఈ ఏడాది దసరా లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ విధంగానే సినిమా విడుదలను వాయిదా వేస్తూ పోతుంటే అది సక్సెస్ పై కొంత ప్రభావాన్ని చూపి రేపు రిలీజ్ తర్వాత ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయినా సినిమాకి కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉందనేది కొందరి వాదన. ఈ విషయాలన్నీ అటుంచితే తొలి సినిమా నుంచి మొన్నటి బాహుబలి వరకు ప్రతి ఒక్క సినిమా విషయమై ఎంతో కేర్ తీసుకుంటూ వరుస విజయాలతో కొనసాగుతున్న రాజమౌళిమూవీ విషయమై కూడా ప్రతి అంశంలోనూ ఎంతో శ్రద్ధ కనబరుస్తుంటారని, అలానే పక్కాగా సినిమాను ఎప్పుడు థియేటర్స్ లోకి తీసుకురావాలి అనే ఆలోచన ఆయనకు ఉందని, మనమే ఈ విధంగా ఆలోచిస్తే సినిమానే ప్రాణంగా భావించే రాజమౌళి ఇంకెంతలా ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటారో అందరూ ఒకసారి గ్రహించాలని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు. ఏది ఏమైనప్పటికీ  ఇటువంటి అనుమానాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఈ సినిమా రిలీజ్ పై అతి త్వరలో ప్రకటన చేస్తే బాగుంటుందని పలువురు ప్రేక్షకులు అభిమానులు కోరుతున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: