ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కాలని ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటారు. అలుపెరగని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉంటారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో స్థానం దక్కించుకుంటే చాలు మన జన్మ ధన్యం అయినట్లే. ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని పురస్కారాలు అందుకున్నప్పటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకోవడం అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి గొప్ప స్థానాన్ని మన సినీ ఇండస్ట్రీలోని స్టార్స్  కూడా సంపాదించుకున్నారు.మన సినీ ఇండస్ట్రీకి చెందిన ఆరుగురు లెజెండ్స్ వాళ్ళ పని వాళ్లు చేసుకుంటూనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి తమకంటూ ఒక పేజీ ను క్రియేట్ చేసుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఆరుగురు ఎవరు?ఎందుకు వారికి ఆ స్థానం దక్కిందో? ఇప్పుడు చూద్దాం..

సుశీల :
గాన కోకిలగా పేరు సంపాదించుకున్న సుశీల 17,645 పాటలు పాడి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అంతేకాదు కేవలం బాలసుబ్రమణ్యంతో 1,336 పాటలు పాడి  చరిత్ర సృష్టించారు.

రామనాయుడు:
రామానాయుడు ఒక గొప్ప నిర్మాత అని మనందరికీ తెలిసిందే. ఈయన 13 భాషల్లో 150 పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకెక్కినాడు. 2008 లో అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాత గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది.

బ్రహ్మానందం:
బ్రహ్మానందం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అగ్ర హాస్యనటుడు బ్రహ్మానందం 1000 సినిమాలో నటించినందుకు గాను బ్రహ్మానందంకు 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటుదక్కింది.

గజల్ శ్రీనివాస్:
గజల్ శ్రీనివాస్ గొప్ప సింగర్.100 భాషలలో 100 పాటలు పాడిన గజల్ శ్రీనివాస్కు 2008లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది.

బాల సుబ్రహ్మణ్యం:
బాలసుబ్రమణ్యం దాదాపు 36 వేల పాటలు పాడి, అత్యధిక పాటలు పాడిన సింగర్ గా 2001లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: