ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సౌత్ ఇండియా  స్టార్ హీరో తలపతి  విజయ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తన స్టార్ డం తో కలెక్షన్లు కోళ్లగొడతాడు. ఇక తలపతి నటించిన తాజా సినిమా ‘మాస్టర్’. ‘ఖైదీ'(2019) దర్శకుడు  లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయ్యింది. సినిమాకి హిట్ టాక్ అయితే ఏమీ రాలేదు కానీ..విజయ్ సేతుపతి నటన, అనిరుథ్ అందించిన మ్యూజిక్.. విజయ్ స్టార్ డం కలగలిపి.. కలెక్షన్లను కొళ్లగొడుతున్నాయని  చెప్పొచ్చు.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు బాగానే వున్నాయి.నెగటివ్ టాక్ తెచ్చుకున్న కాని ఈ సినిమా విజయ్ క్రేజ్ వల్ల సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. ప్రతి ఏరియా లోను లాభాలు బాగానే సాధిస్తుంది.. నిజంగా ఈ సినిమా వసూళ్లు విజయ్ క్రేజ్ కి పెద్ద నిదర్శనం అని చెప్పాలి..ఇక ఈ సినిమా కలెక్షన్ల పట్ల చిత్ర బృందం హ్యాపీగా ఉన్నారట..


ఇక ఈ సినిమా  9 రోజులు పూర్తయ్యేసరికి ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం... తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 13.62 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 4.62 కోట్ల వరకూ లాభాలను మిగిల్చిందని చెప్పొచ్చు. నిన్న కూడా ఈ చిత్రం 0.24 కోట్ల షేర్ ను నమోదు చెయ్యడం విశేషం.దీన్ని బట్టి విజయ్ కి వున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: