రామ్ హీరోగా 2011 లో వచ్చిన ‘కందిరీగ’ మూవీ సక్సస్ తో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కెరియర్ సక్సస్ ఫుల్ గా ప్రారంభం అయింది. ఆ సక్సస్ ను ఆసరాగా చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ హీరో ఇచ్చిన అవకాశాన్ని మలుచుకుని ‘రభస’ మూవీ తీసాడు. జూనియర్ కెరియర్ లో అతి భయంకరమైన ఫ్లాప్ గా ఆమూవీ మారిపోయింది.


ఆతరువాత రామ్ ఈ యంగ్ డైరెక్టర్ కు ‘హైపర్’ మూవీని చేసే అవకాశం ఇచ్చాడు. అది కూడ ఫ్లాప్ గా మారింది. నాలుగు సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్న ఈ డైరెక్టర్ పై నమ్మకం పెట్టుకున్న బెల్లంకొండ సురేష్ తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా చేసి ‘అల్లుడు అదుర్స్’ మూవీని చేసే అవకాశం ఇస్తే ఈ సంక్రాంతి రేస్ కు వచ్చిన ఈమూవీ ఈ సంక్రాంతి సీజన్ ఫ్లాప్ గా మారింది. అయితే ఈ మూవీ నిర్మాతలు మటుకు ‘అల్లుడు అదుర్స్’ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ సక్సస్ మీట్ లు పెట్టి అందర్నీ అదరగొట్టారు.


సంక్రాంతి సీజన్ కు వచ్చిన సినిమాలు అన్నింటిని ఆ మూవీల టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు చాల పెద్దమనసుతో ఆదరించారు. ఇలాంటి పరిస్థితులలో కూడ ‘అల్లుడు అదుర్స్’ మూవీకి ఎటువంటి ఆదరణ లేకపోవడంతో పాటు ఈమూవీకి భయంకరమైన రివ్యూలతో పాటు కనీసపు కలక్షన్స్ రావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.


కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈమూవీలో కామెడీ ఎక్కడ ఉంది అంటూ సగటు ప్రేక్షకుడు కామెంట్స్ చేస్తున్నాడు. వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న బెల్లంకొండ శ్రీను కు ఈ కొత్త సంవత్సరం కూడ పెద్దగా కలిసిరాలేదు అని అనిపిస్తోంది. భారీ ఆశలతో ఏకంగా ప్రభాస్ బ్లాక్ బష్టర్ మూవీ ‘ఛత్రపతి’ ని వినాయక్ దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేయిస్తున్న బెల్లంకొండ అత్యుత్సాహానికి ‘అల్లుడు అదుర్స్’ ఏమాత్రం సహకరించదు అన్నది వాస్తవం..  

మరింత సమాచారం తెలుసుకోండి: