ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సాధారణంగా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమా కథతో పాటు పాటలు కూడా బాగా కుదరాలి. పాటలు బాగా కుదిరి మంచి సక్సెస్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టే.. అంతటి కీలక పాత్ర పోషిస్తాయి పాటలు ఒక సినిమా విజయంలో...ఇక అసలు విషయానికి వస్తే...ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా "రాధేశ్యామ్"ఇక ఈ సినిమా పాటలు కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందా అంటే నిజమే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.ఇక రీసంట్ గా వచ్చిన గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ అందానికి మెస్మరైజ్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ. పీరియాడిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు మ్యూజిక్ ప్రాణంగా నిలవబోతోంది. ఎందుకంటే, ఎలాంటి లవ్ స్టోరీకైనా సరే పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధానంగా కావాలి. అవే సినిమాకి ప్రాణం పోస్తాయి..



అందుకే ఈసినిమాలో సాంగ్స్ ని మరింత శ్రధ్ధగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ తో పాటు అలాగే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ లు అయిన మిధున్ , మనన్ భరద్వాజ్ లు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జస్టిన్ ప్రభాకరన్ అందిస్తున్నారు. అందుకే ఇందులో పాటలు సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటాయట. ఖచ్చితంగా శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటాయట..ఇక అతి త్వరలోనే సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.



మార్చి 11వ తేదిన ఈ సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్. అంతేకాదు, రాధేశ్యామ్ ఆల్బమ్ కూడా అద్దిరిపోయేలా ప్లాన్ చేస్తోందట మూవీ టీమ్. మరి ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఎలాంటి సాంగ్స్ రాబోతున్నాయి..? ఈ పాటలు ఎలా ఉండబోతున్నాయి...?? ఇక ఏ రేంజ్ లో హిట్ అవుతాయి అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: