మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాలో సిద్ధ పాత్రలో చరణ్ సర్ ప్రైజ్ చేయనున్నాడు. కొరటాల శివ ఈ పాత్రను చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారని తెలుస్తుంది. ముందు ఈ పాత్రకు మహేష్ బాబుని తీసుకోవాలని అనుకున్నారట. కాని మహేష్ నో చెప్పడంతో చరణ్ తో తీస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో పాటు చరణ్ ఈ సినిమాలో కూడా తన పాత్రతో మెప్పిస్తాడని అంటున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఓ పిక్ షేర్ చేశాడు చరణ్. ఆచార్యలో కామ్రేడ్ పాత్రలో ఉన్న పిక్ షేర్ చేసి.. పక్కన తన భుజంపై చిరు చెయ్యి వేసిన ఫోటో పెట్టాడు. కామ్రేడ్ మూమెంట్.. నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను అంటూ కామెంట్ పెట్టారు. చూస్తుంటే ఆచార్యలో చరణ్ పాత్ర కూడా హైలెట్ గా నిలిచేలా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాలో చిరు, చరణ్ ఇద్దరు మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇస్తారని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఆచార్య సినిమా మే 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో చిరు కూడా కామ్రేడ్ గా కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా ఇంటర్వల్ సీన్ గురించి ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ నడుస్తుంది.    
                                     

మరింత సమాచారం తెలుసుకోండి: