అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తో పాటు ఎడిటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ తాజా సమాచారం ప్రకారం 18 పేజెస్ సినిమాని దర్శకుడు సుకుమార్ వీక్షించారట. ఆ తర్వాత సినిమా అవుట్ పుట్ అసలు బాగో లేదని అసహనం వ్యక్తం చేశారట. అలాగే సినిమాలో అనవసరమైన సన్నివేశాలను కత్తిరించి.. మిగతా అన్ని సన్నివేశాలను కరెక్ట్ చేయాలని సలహా ఇచ్చారట. తన సూచనల మేరకు సినిమాలోని తప్పులను సరిదిద్దిన తర్వాతనే రిలీజ్ గురించి ఆలోచించాలని సుకుమార్ ఘంటాపథంగా చెప్పారట. దీంతో నిర్మాత అల్లు అరవింద్ కూడా సుకుమార్ నిర్ణయంతో ఏకీభవించి సినిమాలో మార్పులు చేసేంతవరకు రిలీజ్ ని ఆపాలని చెప్పారు. దీనితో నిఖిల్ సినిమాకి బ్రేక్ పడినట్టయింది.
ఇకపోతే నిఖిల్ కెరీర్ లో లేటెస్ట్ గా వచ్చిన చిత్రం అర్జున్ సురవరం. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో అఖిల్ సరసన లావణ్య త్రిపాటి నటించారు. 6-8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 9-12 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. నిఖిల్ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నారు. అందువల్ల ఆయన నటించిన ప్రతి సినిమా హిట్ టాక్ ను అందుకుంటుంది. మరోవైపు 18 పేజెస్ చిత్రానికి కథను అందించిన సుకుమార్ అల్లుఅర్జున్ తో కలిసి పూర్తి సినిమా చేస్తున్నారు. అలాగే తన శిష్యుడైన డైరెక్టర్ సూర్య ప్రతాప్ సినిమాలను పర్యవేక్షిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి