టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి ఎలాగైనా మంచి హిట్ కోసం నాగార్జున ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.అందుకే ఈసారి ఆచి తూచి మంచి కథని ఎంచుకొని "వైల్డ్ డాగ్" తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఊపిరి రచయిత అహిసర్ సోలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అతను గతంలో 2013 లో ఒక బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాటలు లేని ఈ చిత్రానికి నేపథ్య స్కోర్ సంగీతాన్ని తమన్ సమకూర్చారు.బాలీవుడ్ నటి దియా మీర్జా ఈ చిత్రానికి హీరోయిన్. నయామి ఖేర్, బిగ్ బాస్ 3 స్టార్ అలీ రెజా సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది నిజమైన సంఘటన ఆదారంగా తెరకెక్కింది.హైదరాబాద్ లో జరిగిన గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ తరువాత జరిగిన ఎన్కౌంటర్ గురించి ఎన్ఐఏ చేసినా ఒక సీక్రెట్ ఆపరేషన్ ఈ సినిమా కథ.ఇదో పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందట.ఇక ఈ చిత్రం రన్ టైం కేవలం 2 గంటల 6 నిమిషాలకు వచ్చిందని దర్శకుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులని మంచి థ్రిల్ కి గురి చేస్తుందట. ప్రతి సీన్ చాలా ఆసక్తిగా తెరకెక్కించాడట డైరెక్టర్.ప్రేక్షకులను ఆసాంతం సినిమాలో లీనం చెయ్యడం ఖాయమట.2016 ఊపిరి తర్వాత నాగార్జునకు హిట్ లేదు. దానితో ఆయన, ఆయన అభిమానులు ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు.
ఈ చిత్రం ముందుగా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చెయ్యాలి అనుకున్నారు. అయితే చివరి నిముషంలో థియేటర్లు తెర్చుకోవడం, ప్రేక్షకులు ఆసక్తిగా రావడంతో ఆ ఆలోచన విరమించుకుని థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర బృందం వారు. ఇక చూడాలి ఈ సినిమా నాగార్జునకి ఎంతమాత్రం బ్రేక్ ఇస్తుందో...

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి