ఇక మరో గొప్ప విషయం ఏమిటంటే ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) వారు ఏకంగా 9.1/10 రేటింగ్ ను ఇచ్చారు. దాంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఓటిటిలో మిస్ అవ్వకూడదు అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు 'షాదీ ముబారక్' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చెయ్యబోతున్నారు. అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని వారు మార్చి 25న విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని లో- బడ్జెట్ లో నిర్మించడం వలన నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దిల్ రాజుకి లాభాలు వచ్చాయట.
ఇక అమెజాన్ ప్రైమ్లో వ్యూయర్ షిప్ ను బేస్ చేసుకుని మరింతగా చెల్లిస్తారు అన్న సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం కచ్చితంగా ఓటిటిలో విజయం సాధించి.. మరింత లాభాలను తెచ్చిపెడుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. మరి థియేటర్ లలో ఈ చిత్రానికి న్యాయం జరగలేదు. ఇక ఓటీటిలో నైనా న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి