తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మున్నా ద్వారా డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టాడు వంశీ పైడిపల్లి. అయితే ఆ మూవీతో పరాజయం అందుకున్న వంశీ ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన బృందావనం తో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆపై ఎవడు, ఊపిరి వంటి సినిమాలతో మరొక రెండు విజయాలు అందుకున్న వంశీ పైడిపల్లి ఇటీవల ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి అనే బ్లాక్ బస్టర్ సక్సెస్ మూవీ చేశారు. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అలానే ఒక మంచి మెసేజ్ ను కూడా మిళితం చేసి వంశీపైడిపల్లి తీసిన ఈ మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల మహర్షి సినిమాకి జాతీయ స్థాయిలో అన్ని వర్గాల వారిని అలరించే వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించిన విషయం తెలిసిందే. దానితో వంశీ పేరు టాలీవుడ్ వర్గాల్లో మరింతగా మారుమ్రోగుతోంది. ఇక వంశీ తన నెక్స్ట్ మూవీ ని సూపర్ స్టార్ మహేష్ తో చేస్తారనే వార్త కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ మూవీ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఆ మూవీని తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన మూవీకి లో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించారు.

అయితే ఆ సినిమా తర్వాత గౌతమ్, రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తారు అంటూ ఒక వార్త కొద్దిరోజులుగా ప్రచారమవుతోంది. నిజానికి వీరిద్దరి సినిమాలకు నేషనల్ అవార్డులు దక్కినప్పటికీ కూడా ఇప్పటివరకు వీరిద్దరూ తదుపరి సినిమాలు ప్రకటించకపోవడం, అలానే మరోవైపు అంతటి భారీ అవార్డులు దక్కిన తర్వాత కూడా ఏ హీరో నుండి కూడా వీరికి ఎటువంటి పిలుపు రాకపోవడం ఒకింత షాకింగ్ విషయమేనని పలు టాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. అయితే అసలు ఈ వార్త నిజమా కాదా, అసలు వీరిద్దరికీ ఏ హీరోలు అయినా ఛాన్స్ ఇచ్చారా లేదా అనే విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వరకు వెయిట్ చేయక తప్పదంటున్నారు విశ్లేషకులు....!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి