ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఒక సాదాసీదా కామెడీ షోగా బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ ఆ తర్వాత ఇక బుల్లితెర కామెడీ షో చరిత్రలోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికికూడా జబర్దస్త్ కామెడీ షో ని ఢీ కొట్టే కామెడీ షో మరొకటి లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రతి వారం కూడా నవ్వుల సునామీ లో బుల్లితెర ప్రేక్షకులందరికీ ముంచి తేలుస్తుంది జబర్దస్త్. జబర్దస్త్ వస్తుందంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. ఇలా ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల అందరినీ అలరిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ షో.



 ఇకపోతే జబర్దస్త్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా జబర్దస్త్ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని ఇక తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చలాకి చంటి.  కొన్నాళ్లపాటు జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చిన చంటి ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు అయితే ఇటీవలే విడుదలైన జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో లో భాగంగా చలాకి చంటి చేసిన స్కిట్ కాస్త ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా ఆకర్షనీయం గా మారిపోయింది.



 కమల హాసన్ హీరోగా నటించిన సాగరసంగమం సినిమా స్పూఫ్ చేశాడు చలాకి చంటి. ఈ క్రమంలోనే ఇక స్కిట్ స్టార్ట్ కాగానే సాగర సంగమం సినిమాలోని రే రేలా గోపెమ్మల అనే పాట పై డాన్స్ చేసిన చలాకి చంటి అచ్చం కమలహాసన్ ను దింపేసాడు. దీంతో అటు జడ్జెస్ కూడా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తనదైన శైలిలో డాన్స్ చేసి అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ కామెడీని పంచాడు అనే చెప్పాలి. ఏదేమైనా మరోసారి చలాకి చంటి సరికొత్త స్కిట్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. ప్రోమోలో చలాకి చంటి స్కిట్ చూసిన తర్వాత ఇక మొత్తం స్కిట్ చూడటానికి బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: