పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి కొద్ది రోజుల సమయమే ఉండటంతో దర్శక నిర్మాతలతో పాటు సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన అనన్య నాగల్లా, అంజలి, నివేదా థామస్ ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాలుపంచుకుంటున్నారు. నివేదా థామస్ కరోనా వైరస్ బారిన పడడంతో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న లేకపోయారు. కానీ ఆమె సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి ఎంత చిన్న సినిమా అయినా, భారీ బడ్జెట్ సినిమా అయినా ప్రమోషన్లు చేయడం చాలా ముఖ్యం.


అయితే పవన్ కళ్యాణ్ తన సినిమాలను ప్రచారం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వకీల్ సాబ్ చిత్రాన్ని కూడా అంత అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడం లేదు. దీంతో ఆ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల పై ప్రమోషన్ల బాధ్యత పడింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన శృతి హాసన్ ప్రమోషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. నిజానికి ఒరిజినల్ పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ సరసన ఏ హీరోయిన్ నటించలేదు. కానీ టాలీవుడ్ లో పవన్ కి ఉన్న క్రేజ్ ను బట్టి అతనికి ఒక హీరోయిన్ తో పాటు ఓ లవ్ స్టోరీ కూడా స్పెషల్ గా రూపొందించారు.


అయితే ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర కూడా చాలా కీలకమైనదని తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డుమ్మా కొట్టారు. ఈ భారీ కార్యక్రమంలో శృతిహాసన్ పాల్గొని పవన్ పక్కన నిల్చుని కొంచెం సేపు మాట్లాడినా.. మెగా అభిమానులు సంతోషపడేవారు. కానీ ఆమె పవన్ సినిమా గురించి సోషల్ మీడియాలో కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీనితో శృతిహాసన్ తీరుపై పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పవన్, శృతి కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. వకీల్ సాబ్ సినిమాతో ముచ్చటగా మూడోసారి వారిద్దరి జంట రిపీట్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: