మెగా బ్రదర్ నాగబాబు ఆమధ్య నెటిజన్స్ తో సోషల్ మీడియాలో ఛాట్ చేస్తూ తన రెండవ పెళ్ళి పై చేసిన కామెంట్స్ పెను సంచలనం సృష్టించాయి. దీనితో కొందరు నెటిజన్స్ నాగబాబును ‘మీ రెండవ పెళ్ళి ఎప్పుడు’ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎలాంటి విషయం పైన అయినా చాల సరదాగా సమాధానాలు ఇచ్చే నాగబాబు ఈ విషయమై ఇచ్చిన లేటెస్ట్ సమాధానం అతడి సమయస్పూర్తిని చాటుతుంది.
ఈమధ్య ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ ఛాట్ లోకి వచ్చిన నాగబాబును ఆట పట్టిద్దామని ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇచ్చాడు. ‘మా ఆవిడ అంగీకరించడం లేదు ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా’ అంటూ ప్రేమగా చెప్పింది అని కామెంట్ చేస్తూ ఇంత అభిమానించే భార్య ఉన్నప్పుడు తనకు రెండవ పెళ్ళి ఎందుకు అంటూ తనను కార్నర్ చేయాలని ప్రయత్నించిన అభిమానిని నాగబాబు రివర్స్ లో కార్నర్ చేసాడు.
అవకాశం చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో సందడి చేయడమే కాకుండా వివిధ రాజకీయ సామాజిక విషయాల పై నాగబాబు స్పందిస్తూ ఉంటాడు. స్వతహాగా హాస్య ప్రియుడు అయిన నాగబాబు నెటిజన్స్ ఎలాంటి తుంటరి ప్రశ్నలు అడిగినా ఆవేశపడకుండా సున్నితంగా తన మాటలతో తనను ప్రశ్నలు అడిగిన వారిని కార్నర్ చేయడం నాగబాబుకు బాగా వచ్చిన విద్య.
లాయర్ అవుదామనుకుని బి.ఎల్ చదివిన నాగబాబు వకీల్ గా ప్రాక్టీస్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లో లాయర్ గా వేసిన ప్రశ్నల డైలాగ్స్ ను తెగ ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ సినిమాను ఆకాశంలోకి ఎత్తేస్తూ తన తమ్ముడు పై ప్రశంసలుకురిపించాడు. ‘జనసేన’ లో క్రియాశీలకంగా ఉంటూ అప్పుడప్పుడు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే నాగబాబు బుల్లితెర నటుడుగా జడ్జిగా తన ప్రస్థానం కొనసాగిస్తూ మెగా అభిమానులకు పవన్ మధ్య ఎటువంటి గ్యాప్ లేకుండా వారధి గా నాగబాబు తన పాత్రను కొనసాగిస్తున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి