ఈమధ్య ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మనదేశంలోని చాలమంది ప్రతిరోజు కనీసం రోజుకు కనీసం రెండు గంటలు వాట్సాప్ లో వార్తలు చూస్తూ కాలం గడుపు తారని అంచనా. అంతేకాదు మనదేశంలో చాలమంది ప్రతిరోజు తమ ఫేస్ బుక్ ట్విట్టర్ వాట్సాప్ లాంటివి వాడకుండా మానసిక ప్రశాంతత పొందలేక పోతున్నారని ఆ సర్వే అనేక ఆసక్తికర విషయాలను బయట పెట్టింది.


అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో వాట్సాప్ వాడని ప్రముఖ ఒక వ్యక్తి ఉన్నాడు అతడే శేఖర్ కమ్ముల.శేఖర్ కమ్ములకు వాట్సాప్ అంటే ఆశక్తి లేదట. వాట్సాప్ వచ్చిన కొత్తలోనే శేఖర్ కమ్ముల ఈ నిర్ణయం తీసుకున్నాడట. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమి లేనప్పటికీ ఎప్పటికైనా వాట్సాప్ తనకు ఇబ్బందిగా మారుతుందనే భయంతో ఈవిలక్షణ దర్శకుడు వాట్సాప్ను దూరం పెట్టాను అని అంటున్నాడు. అంతేకాదు శేఖర్ కమ్ముల ఎవరినైనా సంప్రదించాలంటే ఫోన్ చేయడంకాని లేదంటే  మెసేజ్ పెట్టడం చేస్తాడు కాని ఎప్పుడు వాట్సాప్ వంక చూడను అని అంటున్నాడు.


అయితే ట్సాప్ వాడకపోవడం వల్ల తనకు అనుకోకుండా కొన్ని ఇబ్బందులు మరి కొన్ని అపార్ధాలు  కూడ ఎదురు  అయ్యాయి అని అంటున్నాడు. దీనికి సంబంధించి వివరిస్తూ వాట్సాప్ వాడక పోవడం వల్ల తనకు  వెంకటేష్ తో వచ్చిన  కొన్ని ఇబ్బందులు బయట పెట్టాడు. ఆ మధ్య శేఖర్ కమ్ముల పుట్టినరోజునాడు హీరో వెంకటేష్ అతడికి శుభాకాంక్షలు చెబుతూ వాట్సాప్ మెసేజ్ పెడితే దానికి శేఖర్ కమ్ముల నుంచి రిప్లయ్ రాలేదని  వెంకటేష్ హర్ట్ అయ్యాడట.  



అయితే శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడడని రానా చెపే వరకు వెంకటేష్ కు శేఖర్ కమ్ముల పై వచ్చిన కోపం తగ్గలేదట. ఇలా చాలా మంది తనను అపార్థం చేసుకుంటున్నారని అయినప్పటికీ తను వాట్సాప్ వాడనని  కేవలం  తనకు మాట్లాడ్డం కోసం ఫోన్ ఉంటే చాలని అందులో ఎలాంటి ఎక్స్ ట్రా ఫీచర్లు అవసరంలేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా నేటి యూత్ మెచ్చే లవ్ స్టోరీలు తీసే శేఖర్ కమ్ముల నేటితరం బాగా ఇష్టపడే వాట్సాప్ ను పక్కకు పెట్టడం ఆశ్చర్యకరం..


మరింత సమాచారం తెలుసుకోండి: