బాలీవుడ్ లో వారసుల హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్టార్ ల కూతురు లు
హీరోయిన్ లుగా రాణిస్తూ
బాలీవుడ్ కి ఎంతో వన్నె తెస్తున్నారు. సినిమాల్లో తమ నిండిన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. సౌత్ లో ఎక్కువగా హీరోల కొడుకులు సినిమాల్లోకి రావడం హీరోలుగా స్టార్ హీరోలు అవ్వడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి భిన్నంగా బాలీవుడ్లో హీరోల కూతుర్లు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తమ సోయగాలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన
హీరోయిన్ లు తమ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. తరగని అనడంతో వారు ప్రేక్షకులను ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తున్నారు.. తమ పరువాలతో
సినిమా అవకాశాలను దక్కించుకుని స్టార్
హీరోయిన్ లు గా ఓ వెలుగు వెలుగుతున్నారు.

అలా బోనికపూర్ సోదరుడు
సంజయ్ కపూర్ తనయ షనాయ కపూర్ తన అందాలతో సోషల్
మీడియా ను షేక్ చేస్తోంది. సినిమాల్లోకి రాకముందే ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపొయింది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి త్వరలో వస్తుండగా
కరణ్ జోహార్ ఈమెను తనదైన స్టైల్ లో పరిచయం చేయబోతున్నాడట.
బాలీవుడ్ లో స్టార్ ల కూతుళ్లను సినిమాల్లోకి పరిచయం చేయడంలో
కరణ్ జోహార్ దిట్ట. అందరిలాగా ఈమెను కూడా త్వరలోనే
బాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడట.

అర్జున్ కపూర్.. జాన్వీ.. ఖుషి.. సోనమ్ కపూర్ లకు కజిన్ అయిన షనాయా ఇప్పటికే పొట్టి పొట్టి డ్రెస్సులతో , బికినీ లతో సోషల్ మీడియాలో కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టింది. వారి అక్కల దారిలోనే ఈమె సోషల్ మీడియాలో తాజాగా కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలో ఆమెను చూసిన వారంతా ఫ్లాట్ అయిపోతున్నారు. వైట్ కలర్ డ్రెస్, బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆమె
హీరోయిన్ కావాల్సిన అన్ని లక్షణాలతో కనిపిస్తూ అందరి మతి పోగొడుతుంది. దివి నుంచి వచ్చిన అప్సరసల ఆమె లేత అందాలు చూపిస్తూ దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఈమెను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.