ఫీల్ గుడ్ చిత్రాలతో మంచి ప్రేక్షకాభిమానాన్ని పొందిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తొలి చిత్రం ఆనంద్ దగ్గర్నుంచి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ చిత్రం వరకు ప్రతి ఒక్క సినిమా ఫీల్ గుడ్ సినిమాగా తెరకెక్కిన సినిమానే. ప్రతి ఒక్క హీరో ఆయన దర్శకత్వంలో ఇలాంటి సినిమా చేసి హిట్ కొట్టాలని చూస్తూ ఉంటారు. అందుకే టైం జరిగిన ప్రతిసారి శేఖర్ కమ్ముల తో సినిమా చేయాలని ఆలోచిస్తుంటారు హీరోలు.

అయితే శేఖర్ కమ్ముల కి మాత్రం మీకు అవకాశం వస్తే ఏ స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూ లో ఎదురవగా ఆయన పవన్ కళ్యాణ్ పేరు చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీ ఖుషీ చేశారు. తన మొదటి సినిమా టైం నుంచి పవన్ కళ్యాణ్ తో ఎప్పటికైనా సినిమా చేయాలనేది నా డ్రీమ్ అని చెప్పాడు శేఖర్ కమ్ముల. నిజానికి లీడర్ సబ్జెక్టుని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు. ఇటీవల ఓ సందర్భంలో శేఖర్ కమ్ముల ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నీ డైరెక్ట్ చేసే అవకాశం అతనికి రాలేదు.

 అయితే ఆ కోరిక తీరే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా శేఖర్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఇటీవల ఓ మంచి కథ ఉంటే చెప్పమని శేఖర్ కమ్ములకు చెప్పాడట. అతనికి అత్యంత సన్నిహితుడు నిర్మాణంలో ఈ చిత్రాన్ని చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో శేఖర్ పవన్ ఇమేజ్ కు సరిపడే స్క్రిప్టును రెడీ చేసే పనిలో పడ్డాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో అతను గతంలో అనుకున్న ఓ లైన్ ను ఇప్పుడు డెవలప్ చేసే పనిలో పడ్డాడట. ఒక్కసారి స్క్రిప్ట్ ఓకే అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: