కరోనా వైరస్ సినీ రంగంపై ఎంతలా ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడు కళకళలాడిపోయే సినీ పరిశ్రమ మూగబోయింది. సరిగ్గా షూటింగులు జరగక బాక్సాఫీస్ వద్ద సినిమాలు విడుదల కాక.. చివరికి సిని కోలాహలం పూర్తిగా కనుమరుగైంది. అయితే ఎంతో మంది సినీ సెలబ్రిటీల పై కరోనా వైరస్ పంజా విసిరింది. ఇక అందరూ మనోధైర్యంతో వైరస్ బారి నుంచి కోలుకున్నారు.  ఈ క్రమంలోనే ప్రస్తుతం షూటింగ్స్ నేపథ్యంలో ఎంతోమంది ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



 ఇక్కడ ఒక సీనియర్ హీరో తీసుకుంటున్న జాగ్రత్తలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇటీవలే షూటింగ్ కి వెళ్తున్న సమయంలో ఆ హీరో వేషధారణ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరు అని అనుకుంటున్నారా.. ఇంకెవరు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్. 70 ఏళ్ళు దాటినప్పటికీ ఇంకా అదే జోష్ కొనసాగిస్తూ ప్రస్తుతం దూసుకుపోతున్నారు బాలీవుడ్ మెగాస్టార్. కరోనా వైరస్ టైమ్ లో వరుసగా షూటింగ్లకు వెళ్తూ అందరిలో ఎనర్జీ నింపుతున్నారు  అమితాబచ్చన్.


 గతంలో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న ఆయన.. ప్రస్తుతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్లీ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు అమితాబచ్చన్ ఇటీవలే ముంబైలో పలు నిబంధనల మధ్య షూటింగ్స్ కి అనుమతి ఉండడంతో.. ఇక బిగ్ బి  షూటింగ్ కి బయలుదేరుతూ  ఉన్న ఒక ఫోటో ని  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లాక్‌డౌన్‌ 2.0 తర్వాత తొలి రోజు షూటింగ్ అంటూ ఇక ఈ పోస్ట్ కి ట్యాగ్ రాసుకొచ్చారు. పాంగోలిన్ మాస్క్ పెట్టుకొని పూర్తిగా తన ముఖాన్ని మొత్తం కప్పి ఉంచుకుని ప్రస్తుతం షూటింగ్ కి వెళ్తున్నారు అమితాబచ్చన్. ఆయన తీసుకుంటున్న జాగ్రత్తల తో షాక్ అవుతున్న అభిమానులు ఆయన షూటింగ్కు వెళ్తుండటంతో మాత్రం సంతోష పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: