తెలుగు చిత్ర పరిశ్రమ లో అనుష్క శర్మ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన అనుష్క తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మారి పోయింది. అయితే చిత్ర పరిశ్రమ లో రాణించాలి అంటే టాలెంట్ ఎంత ముఖ్యమో.. టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కూడా ఉండాలి.



 కానీ.. ఒక్క సినిమా తో ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంది అనుష్క. సైజ్ జీరో అనే సినిమాతో ఒక్కసారిగా లావెక్కిన అనుష్క  పెద్ద రిస్క్ చేసింది. ఇక ఎంత రిస్క్ చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత అనుష్క కెరీర్ కాస్త రిస్క్ లో పడింది.  స్టార్ హీరోయిన్ అనుష్క కాస్త అవకాశాలు రాక వెండితెర పై కనుమరుగు అయ్యింది. దీంతో ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది అనుష్క. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో  తనదైన శైలిలో అలరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.



 అయితే ఇటీవలే నిశ్శబ్దం అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్నంత స్థాయిలో విజయం మాత్రం సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల అనుష్క ఒక వైవిధ్యమైన పాత్రలో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భర్త చనిపోయి పిల్లల బాధ్యతను చూసుకునే సింగిల్ మదర్ గా అనుష్క నటించబోతుందట. పెళ్లయిన నాలుగో రోజు భర్త చనిపోతాడు.  ఇక ఆ తర్వాత ఆమె గర్భం దాల్చిన విషయం తెలుస్తుంది. చివరికి ఎన్నో కష్టాలు పడి చివరికి కవల పిల్లలకు జన్మనిస్తుంది. తర్వాత జీవితమే సినిమాగా సాగుతుందని టాక్ వినిపిస్తుంది. తమిళ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: