సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తుంది టాలీవుడ్. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు సెట్స్ మీదనే ఉన్నాయి. ఆల్రెడీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ ను అందుకోవడానికి షూటింగ్ లు చకచకా చేసేస్తున్నాయి. అలా ఏ హీరో షూటింగ్ స్టార్ట్ చేశారు? ఏ సినిమా సెట్స్ పై ఉందో ఇప్పుడు చూద్దాం. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. గండిపేట లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సెట్ లో రామ్ చరణ్ దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దాన్నిబట్టి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది.

ఇక చిరంజీవి కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కూడా కోకాపేటలో మొదటి నుంచి మొదలైందని తెలుస్తోంది. మూడేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ను ఊరిస్తున్న రాధే శ్యామ్ సినిమా ఫైనల్ టచ్ చేసి కోసం రామోజీ ఫిలిం సిటీలో ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేశారు. జూలైలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టైం కి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక నాని హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మొదలైన శ్యామ్ సింగ రాయ్ సినిమా సిబిఐటి కాలేజీ లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.

నాగచైతన్య, రాశీఖన్నా జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ  సినిమా సికింద్రాబాదులో మొదలయ్యింది. తమిళ్ హీరో విశాల్ తన 31వ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలుపెట్టారు. తమిళనాడులో షూటింగ్ లకు ఇంకా పర్మిషన్ లేకపోవడంతో ఆయన ఇక్కడ తన సినిమాను మొదలు పెట్టారు. విశ్వక్ సేన్ హీరో గా నటించిన పాగల్ సినిమా షామీర్ పేట్ లో జరుగుతోంది. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో ని పుష్ప మరియు మహేష్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట అలాగే పవన్ కళ్యాణ్ , రానా ల మల్టీస్టారర్ సినిమా, వెంకటేష్ వరుణ్ తేజ్ f3 సినిమా, బాలకృష్ణ అఖండ సినిమా లు జూలై 1 నుంచి షూటింగ్ లు జరుపుకోబోతున్నాయని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: