ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్యాప్ ఇచ్చిన త‌ర్వాత జోరు మీద సినిమాలు చేస్తున్నారు. వ‌రుస‌గా పెద్ద డైరెక్ట‌ర్ల‌ను లైన్‌లో పెడుతున్నారు. రీసెంట్ గా వ‌చ్చిన వ‌కీల్ సాబ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఇక దీని త‌ర్వాత పవన్ కళ్యాణ్ చాలా త్వరగా సైన్ చేసిన మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్. దీన్ని రీమేక్ సినిమాగా చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ మూవీని సజెస్ట్ చేసిన త‌ర్వాత పవన్ ఒప్పుకోవడంతో పాటు మూవీని సెట్స్ పైకి వెళ్లడం చకచకా జరుగుతున్నాయి.

వకీల్ సాబ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పవన్ డేట్స్ పూర్తిగా హరి హర వీరమల్లు సినిమా చేయ‌డానికే కేటాయించడం చేస్తున్నార‌. కానీ ప్ర‌స్తుతం రీమేక్ కోసం అడ్జెస్ట్ చేసి కొన్ని డేట్స్ ను సాగర్ కె చంద్రకు ఇచ్చార‌ని ప్ర‌చారం జరిగింది. కాబ‌ట్టి కొన్ని రోజుల వ్యవధిలోనే ఇవన్నీ ప‌వ‌న్ చేస్తున్నారు ప్ర‌స్తుతం. అలాగే పవన్ అంత త్వరగా ఆ మూవీకి సైన్ చేయడానికి మాత్రం కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అది కూడ ఆయాబ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోనికే జీవితంలోనివే కావడం విశేషంగా ఉంది.

ఒరిజినల్ కథలో హీరో ఎక్సయిజ్ విభాగంలో పనిచేసే ఎస్ఐగా ఉంటాడు. కానీ ఇదే పవన్ జీవితానికి రిలేట్ కావ‌డంతో పవన్ కళ్యాణ్ తండ్రి కూడా గ‌తంలో ఆబ్కారీ శాఖలో పనిచేసిన పోలీస్ అధికారిగా ఉండ‌టంతో ప‌వ‌న్ కు ఇది బాగా న‌చ్చింద‌ని తెలుస్తోంది. కాగా ఈ పాత్ర చేయడానికి ప‌వ‌ర్ స్టార్ కు మోటివేషన్ ఆయ‌న తండ్కే అయ్యుండొచ్చు.

ఇక పవన్ గతంలో కూడా ప‌వ‌న్ పోలీస్ పాత్రలు చేసినా ఆబ్కారీ శాఖలో పనిచేసే పోలీస్ పాత్రను ఇప్ప‌టి వ‌ర‌కు చేయలేదు. అయితే  ఈ సినిమాలో సామాన్యులకు, డబ్బున్న వ్యక్తులకు సొసైటీలో ఎలాంటి తేడాలు ఉంటాయ‌నే అంశాన్ని కూడ నిగూఢంగా చూపించ‌డానికి వస్తుంది ఈ మూవీ. ఈ కార‌ణం కూడా పవన్ సినిమా ఒప్పుకోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి గా చెప్పొచ్చు. అయ‌తే రెండు రోజులుగా పవన్ ఫ్యాన్స్ ఈ అంశాలనే సోషల్ మీడియాలో వీడియో రూపంలో చెప్తూ తెగ ప్ర‌చారం చేస్తూ విప‌రీతంగా వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: