తమిళనాట స్టార్ హీరోగా కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన విజయ్ దళపతి కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తెలుగులో మాత్రమే కాదు దక్షిణాదిన కూడా ఆయన మార్కెట్ సంపాదించుకోవడంలో విజయవంతమయ్యారు. ఆయన సినిమాలు ఉత్తరాదిన కూడా ఈ మధ్య విడుదల అవుతుండడం తో అక్కడ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నట్లయింది. ప్రేక్షకులు మాత్రమే కాదు అక్కడ సెలబ్రిటీలు కూడా ఆయన నటనకు ఫిదా అయిపోయి ఫ్యాన్స్ అయ్యారట.

మాస్టర్ సినిమా బాలీవుడ్ లో కూడా విడుదలై మంచి పేరు దక్కించుకోగా అంతకుముందు కొన్ని డబ్బింగ్ చిత్రాలతో విజయ్ వారికి పరిచయం అయ్యా రు. ఈ సినిమాతో మరింత చేరువయ్యారు అని ఆయనకున్న పాపులారిటీ చూస్తే తెలుస్తోంది . తాజాగా విజయ్ దళపతి గురించి బాలీవుడ్ బాద్ షా షారుక్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే షారుక్ ఖాన్ ఈ మధ్య సినిమాల పరంగా కాస్త వెనుకబడ్డారు. ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండడంతో ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం ఆయన వేచి చూస్తున్నారు.

 ఇదిలా ఉంటే ఆయన సినీ జీవితానికి 29 సంవత్సరాలు నిండిన సందర్భంగా Ask Srk  అంటూ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించారు. లేడీస్ ఎందుకు అడిగిన అన్ని ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే విజయ్ గురించి మీ అభిప్రాయం చెప్పమని అడిగాడు ఓ అభిమాని. వెరీ కూల్ అంటూ విజయ్ దళపతి విజయ్ పై తన ప్రేమను కురిపించారు.  దీనికి విజయ్ అభిమానులు షారుక్ ఖాన్ ను పొగడ్తల వర్షంలో ముంచేస్తున్నారు. ఇవే కాకుండా సినిమా థియేటర్ల ఓపెనింగ్ గురించి, సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు గురించి, ఆయన కొత్త సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: