కార్తీక నాయర్.. ఈమె ఎవరో కాదు అలనాటి ప్రముఖ నటి కూతురు. 12సంవత్సరాల క్రితం సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు 10చిత్రాల్లో నటించి కుర్రకారులో గిలిగింతలు పెట్టారు. తెలుగులో ముచ్చటగా మూడు చిత్రాల్లో నటించారు. 2009లో అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా వచ్చిన.. జోష్ చిత్రంలో తన 17వ ఏట తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక తమిళ్ డబ్బింగ్ మూవీ రంగంలో కార్తీక నాయర్ అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించినా అధృష్టం ఆమె తలుపుతట్టలేదు. కార్తీకకు ఊహించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 2012లో రిలీజ్ అయిన దమ్ము సినిమా ఫ్లాప్ కావడంతో ఛాన్స్ లు దక్కకుండా పోయాయి. తర్వాత తమిళం, మలయాళంలో నటించిన కార్తీకకు నిరాశే ఎదురయింది. మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ డైరెక్షన్ లో మకరమంజు  సినిమాలో యాక్ట్ చేశారు.   భారతీరాజా దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించారు.  ఇక తెలుగులో 2014లో చివరిగా బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటించారు. 2016లో రిలీజ్ అయిన తమిళ చిత్రం "వా డీల్" ఆఖరిది.

సినిమాలు తనకు కలిసి రావడం లేదని భావించాలో ఏమో గానీ ఇక యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించినట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఇక చేసేదేమి లేక కార్తికా నాయర్ వ్యాపారంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అఢుగులు వేశారు కూడా.  

కార్తికా నాయర్ 1992వ సంవత్సరం జూన్ 27న చెన్నైలో జన్మించారు.జన్మించారు. ముంబయిలోని పోడర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రైమరీ ఎఢ్యుకేషన్ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ కాలేజీలో బిజినెస్ డిగ్రీ పూర్తి చేశారు. కార్తికకు చెల్లెలు, తమ్ముడు కూడా ఉన్నారు. ఆమె చెల్లెలు తులసి నాయర్ కూడా పలు చిత్రాలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: