ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మినహాయించి జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కలిసి మరో సినిమా చేయనున్నారు. అంతే కాకుండా ఆయన బుల్లితెర రియాలిటీ షో అయిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కి సీజన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ రియాల్టీ షో కి సంబంధించిన ప్రోమో విడుదలై విశేషమైన స్పందన దక్కించుకుంది.

అయితే ఎన్టీఆర్ ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకుగాను అక్షరాలా పది కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని ఇటీవల రూమర్స్ హల్ చల్ చేశాయి. ఐతే జెమినీ టీవీ యాజమాన్యం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ని చాలా గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఒక్క షోతో తెలుగు బుల్లితెర రంగంలో విపరీతమైన పాపులారిటీని పెంచుకోవాలని జెమినీ టీవీ తపన పడుతోంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ అవైలబుల్ లో లేకపోవడంతో ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన షో ఆలస్యం అవుతూ వస్తోంది. దీనితో సన్ నెట్‌వర్క్ యాజమాన్యం ఎన్టీఆర్ పై తీవ్ర ఒత్తిడి చేస్తోంది.

త్వరగా షూట్ లో జాయిన్ కావాలని పదేపదే అడుగుతూ తారక్ ని సన్ నెట్‌వర్క్ ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. షో కి వ్యాఖ్యాతగా కమిట్ అయ్యారు కాబట్టి తారక్ కూడా షూట్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారట. సన్ నెట్‌వర్క్ నిర్వాహకులు తనని ఎలా ఒత్తిడి చేస్తున్నారో.. అదే తరహాలో తారక్ కూడా రాజమౌళిపై ఒత్తిడి తెస్తున్నారట. ‘ఆర్ఆర్ఆర్’ లో తన పోర్షన్ ను త్వరగా షూట్ చేయాలని ఎన్టీఆర్ రాజమౌళిని అడుగుతున్నారట. దీనితో తారక్‌తో రాజమౌళికి పెద్ద చిక్కు వచ్చి పడిందని సినిమా వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోపక్క రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళిపై ప్రెజర్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: