కొన్ని విషయాలు సినీ జనాలను తికమక పెడుతుంటాయి. ఏ హీరో పక్కన ఏ హీరోయిన్ ఉందో.. వాళ్లేం మాట్లాడుకున్నారో.. అసలేం జరిగి ఉంటుందో... ఇలాంటి గాసిప్స్ పుట్టుకొస్తుంటాయి. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందనీ.. లేదా సహజీవనం చేస్తున్నారని ఊహాగానాలు పుట్టుకొస్తుంటాయి. అందులో నిజం ఉంటుందో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం గాసిప్స్ వచ్చేస్తాయి. దీనికి పలువురు సెలబ్రెటీలు క్లారిటీ ఇస్తే.. మరికొందరు ముఖం తిప్పుకొని వెళ్లిపోతారు. ఇంకొందరు సిల్లీగా కొట్టి పారేస్తారు.

ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్‌గా ఉంటే అది స్నేహమా.. ప్రేమా.. సహజీవనమా.. అనే దానికి ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అయితే సారా అలీ ఖాన్‌ స్టేటస్‌ గురించి ఎప్పుడూ ఏదో ఒక టాక్‌ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే రెండు సార్లు బ్రేకప్‌ అయిన సారా, ఇప్పుడు మళ్లీ లవ్‌లో పడిందనే ప్రచారం జరుగుతోంది.

సారా అలీ ఖాన్ సినిమాల గురించి బాలీవుడ్‌లో ఎప్పుడూ పెద్దగా డిస్కషన్స్‌ జరగవు. కానీ ఈమె రిలేషన్స్‌ గురించి ఎప్పుడూ ఏదో ఒక మాట వినిపిస్తూనే ఉంటుంది. లేటెస్ట్‌గా సారా అలీ ఖాన్ 'కేదార్‌నాథ్' సినిమా అసిస్టెంట్‌ డైరెక్టర్ జహన్ హండాతో లవ్‌లో ఉందనే టాక్ వస్తోంది.

జహాన్ హండా ఎఫైర్ గురించి సారా అలీ ఖాన్ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. జహాన్ కూడా బాలీవుడ్‌ ప్రచారంపై అవునని గానీ, కాదని గానీ చెప్పలేదు. అయితే వీళ్లిద్దరు కలిసున్న ఫోటోస్‌ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోస్‌కి ఉన్న లవ్‌ సింబల్స్, టేక్‌ మీ బ్యాక్ లాంటి క్యాప్షన్స్ చూసి ఇద్దరూ లవ్‌లో ఉన్నారని కన్ఫర్మ్ చేస్తున్నారు నెటిజన్లు. 'లవ్ ఆజ్ కల్' సినిమా టైమ్‌లో సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్‌ లవ్‌లో ఉన్నారని ముంబాయి మొత్తం చెప్పుకుంది. బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా సారా పేరుతో కార్తీక్‌పై పంచ్‌లేసేవాళ్లు. అయితే కొన్నాళ్ల తర్వాత సారా, కార్తీక్ విడిపోయారని, కార్తీక్ జాన్వీతో క్లోజ్ అయ్యాడనే మాటలు వినిపించాయి. ఇక ఇప్పుడు సారా, జహన్‌తో లవ్‌లో ఉందని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: