ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమాల విడుదల లేకపోయినా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ ‘బెస్ట్  మేడ్ ఫర్ ఈచ్ అదర్’ కపుల్ గా పేరుగాంచిన స్టార్ క‌పుల్ అమీర్‌ఖాన్‌ కిర‌ణ్‌ రావ్ లు విడిపోవ‌డానికి  సంబంధించిన వార్తల షాక్ నుండి ఇంకా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు తేరుకోలేక పోతున్నాయి.  


మీడియాను షేక్ చేస్తున్న ఈ వార్తల పై  వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌ వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌ లో స్పందించాడు. ‘అమీర్‌ ఖాన్‌ కిరణ్‌ రావ్ లకు ఎలాంటి బాధ లేకుండా విడిపోవడానికి సిద్ధమైనప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్లందరూ ఎందుకు ఇబ్బందిపడుతున్నారు. వాళ్ల గురించి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు?. అమీర్‌ కిరణ్‌రావు.. భవిష్యత్తులో మీ వ్యక్తిగత జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. ఇంతకుముందు లేని విధంగా ఇక పై మీ జీవితాలు మరింత రంగులమయంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా దృష్టిలో వివాహం కంటే విడాకులనే ఎక్కువ సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఎందుకంటే వివాహం అనేది మూర్ఖత్వం అజ్ఞానంతో ముడిపడి ఉన్నది. కానీ విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో కూడుకున్న పని’ అని  వర్మ సోషల్ మీడియా ద్వారా చేసిన కామెంట్స్  సంచలనంగా మారాయి.


అమీర్ ఖాన్ కిరణ్ రావ్ ల విడాకుల ప్రకటన వచ్చిన కొన్ని గంటలకే క్రేజీ హీరోయిన్ మెహ్రీన్‌ హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో తాను  చేసుకున్న ఎంగేజ్‌ మెంట్‌ రద్దు చేసుకున్నట్లు  ప్రకటించి ఈ ఇండస్ట్రీ విడాకుల ట్రెండ్ ను కొనసాగించింది. తాను సినిమాలు మానేస్తున్నాను అంటూ ఆమధ్య ప్రకటన ఇచ్చిన మెహ్రీన్ ఇప్పుడు వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటూ అందరికీ షాక్ ఇస్తోంది.


దీనితో ఫిలిం ఇండస్ట్రీలో సెలెబ్రెటీల వైవాహిక బంధాలు గాలి బుడగలులా మారిపోతున్నాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం భారత్ లో గత కొంత కాలంగా విడాకుల కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆ ట్రెండ్ లో భాగమే ఇది అంతా అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: