1994 ప్రాంతంలో గుణశేఖర్ తీసిన ‘బాలరామాయణం’ తో జూనియర్ ఎన్టీఆర్ ఫిలిం ఎంట్రీ జరిగింది. వాస్తవానికి జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ పక్కన ‘భ్రహ్మర్షి విశ్వామిత్ర’ మూవీలో నటించినప్పటికీ జూనియర్ కు బాల నటుడుగా గుర్తింపు తీసుకు వచ్చిన మూవీ మాత్రం ‘బాలరామాయణం’ మాత్రమే.  


ఇప్పుడు అదే గుణశేఖర్ నందమూరి ఫ్యామిలీ నాల్గవ తరాన్ని వెండి తెర పై తీసుకు రావడానికి జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నెల్ లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘శాకుంతలం’ మూవీలో బాల భరతుడు గా జూనియర్ కొడుకు అభయ్ రామ్ ఎంపిక ఖరార్ అయినట్లు తెలుస్తోంది.


ఇదే మూవీలో మరో కీలకమైన చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో అల్లు అర్జున్ కూతురు అర్ష కూడ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గుణశేఖర్ రానా తో తీయాలి అనుకున్న ‘హిరణ్యకశిప’ మూవీతో అభయ్ రామ్ బాల హిరణ్య కసిపుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ జరుగుతుంది అన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమూవీ ప్రారంభించడం చాల ఆలస్యం అయ్యే పరిస్థితులలో అభయ్ రామ్ ముందుగా బాల భారతుడుగా మారుతున్నట్లు తెలుస్తోంది.


అయితే ‘శాకుంతలం’ ఆర్ష ఏ పాత్ర పోషిస్తుంది అన్న  విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘శాకుంతలం’ మూవీకి సంబంధించి అన్న పూర్ణ స్టూడియోలో వేసిన ఒక భారీ ఆశ్రమం  సెట్ లో సమంత అభయ్ రామ్ ఆర్ష ల కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ కూతురు ఆర్ష కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయర్స్ ఉన్నారు. ఆర్ష తల్లి స్నేహా రెడ్డి బన్నీ కూతురు చేసే రకరకాల డాన్స్ లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండటంతో బన్నీ అభిమానులు అంతా ఆర్ష అభిమానులుగా మారిపోయారు. ఇప్పటికే అభయ్ రామ్ ఫోటోలు కనిపిస్తే చాలు తారక్ అభిమానులు వేల సంఖ్యలో లైక్స్ కొడుతున్నారు. ఇప్పుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ తో వీరిద్దరూ చైల్డ్ సెలెబ్రెటీస్ గా మారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..  



 

మరింత సమాచారం తెలుసుకోండి: