తెలుగు సినిమా రంగంలో దర్శకుడిగా రాణించాలని ఎంతో మంది కలలుకంటూ ఉంటారు. దర్శకుడిగా ఇక్కడ రాణించాలన్నా... స్టార్ డైరెక్టర్ గా ఎదగాలన్నా... బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టాలన్నా అంత సులభంగా అవకాశాలు రావు. ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసిన వారే ఇక్కడ సుదీర్ఘకాలం డైరెక్టర్ గా రాణిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం అప్డేట్ కాకపోతే ఎంత గొప్ప డైరెక్టర్ కెరీర్ అయినా ముగిసిపోయినట్టే..!  ఇక చాలామంది ఇది సినిమా రంగంలో రాణించాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చి... ఎన్నో శాఖలలో... ఎన్నో సంవత్సరాలు పని చేస్తే కానీ డైరెక్టర్లు కాలేకపోయారు.

ఇక డైరెక్టర్ శ్రీవాస్ విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం కు చెందిన ఆయన డిగ్రీ పూర్తయిన వెంటనే సినిమారంగంలో రాణించాల‌న్న కోరిక‌తో ఇక్క‌డ కాలు మోపారు. ముందుగా ఆయ‌న కెమెరామెన్ గా రాణించాలని ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ విన్సెంట్‌ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలోనే నాగార్జున హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన భక్తిరస చిత్రం అన్నమయ్య సినిమాకు ఐదో సహాయక కెమెరామెన్ గా పనిచేశారు. అయితే శ్రీవాస్ చాలా హైట్ వుండడంతో నాగార్జునకు పొజిషన్ ఇచ్చే క్రమంలో రాఘవేంద్రరావు ఎక్కువగా ఆయ‌న‌ సహాయం తీసుకునే వారట.

అప్పుడు రాఘ‌వేంద్ర రావు శ్రీవాస్ ను సింపుల్‌గా వాసు అని పిలిచేవార‌ట‌. అలా శ్రీవాస్ ఇండ‌స్ట్రీలో చాలా మందికి వాసుగా ప‌రిచ‌యం అయ్యారు. అలా సినిమా రంగంలోకి వచ్చిన శ్రీనివాస్ పలువురు దర్శకుల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి లక్ష్యం - సాక్ష్యం సినిమాలతో పాటు బాలకృష్ణ డిక్టేటర్ సినిమా తెర‌కెక్కించారు. ప్రస్తుతం శ్రీవాస్‌ బాలయ్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక శ్రీవాస్ రాఘ‌వేంద్ర రావు గారి సినిమాకు తాను తొలిగా వ‌ర్క్ చేయ‌డం త‌న కెరీర్ కు ఎంతో ప్ల‌స్ అయ్యింద‌ని చాలా సార్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: