ప్రస్తుతం టోక్యో లో జరుగుతున్న ఒలంపిక్ క్రీడలకు వెళుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి , ఎంతో ఉత్సాహంతో సాహసంతో గెలవాలనే ప్రయత్నం తో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారతదేశం నుంచి టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో, పాల్గొనడానికి వెళ్తున్న భారతీయ క్రీడాకారులు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అందులో భాగంగానే ఆర్.ఆర్.ఆర్ మూవీ టీం కూడా డ ఒక పోస్టర్ ని విడుదల చేసి ఒలంపిక్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ కూడా వైరల్ గా మారింది.

ఒలంపిక్స్ గుర్తులతో 5 రింగులు కలిగిన ,  ఆ పోస్టర్ లో ఒక నీడ రూపంలో  రామ్ చరణ్ గన్ పట్టుకొని గురి పెడుతున్నట్లు ఉండగా, ఇక ఎన్టీఆర్ బల్లెం చేత పట్టుకొని విసిరినట్లు ఉంది. బ్లాక్ షాడో రూపంలో రామ్ చరణ్ విల్లు పట్టుకుని ఉండగా,  ఎన్టీఆర్ పరిగెడుతున్నట్లు ఉన్న ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్ ని విడుదల చేసిన మూవీ మేకర్స్, భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ ను జోడించడం జరిగింది.

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని , త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇందులో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్ లతో పాటు ఎన్నో పోస్టర్లను విడుదల చేసిన చిత్రం మేకర్స్ , ఈ మూవీకి మరింత హైప్ ను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా..? అని ఎదురు చూడడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్,  ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలో కనిపించడం కారణంగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: