చైనా లో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా చాలా పరిశ్రమలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమపై కరోనా పడగ దారుణంగా పడింది. దీంతో సినిమా షూటింగ్స్‌ తో సహా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చాలా సినిమాలు తమ రిలీజ్‌ డేట్స్‌ ను మార్చేసు కున్నాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో నారప్ప సినిమాను అమెజాన్‌ ఫ్రైమ్‌ లో రిలీజ్‌ చేశారు. ఈ సినిమా ఈ నెల 20న విడుదల అయింది. ఓటీటీ వేదికగా రిలీజ్‌ అయిన ఈ మూవీ.. మంచి టాక్‌ తెచ్చుకుంది. వెంకటేష్‌ యాక్టింగ్‌ కారణంగా ఈ సినిమా ఓ రేంజ్‌ కు వెళ్లిందని సినిమా ప్రేమికులు అంటున్నారు.

 ఇక ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌ లోని ప్రముఖులు అంటే... మెగాస్టార్‌ చిరంజీవి నుంచి కింది స్థాయి హీరోల వరకు అందరూ  ఫిదా అయిపోయారు. ఇలాంటి సినిమాలు పరిశ్రమకు కావాలంటూ... తెగ పొగిడేశారు.  మెగాస్టార్‌ చిరంజీవి ఓ వీడియో ద్వారా నారప్పకు రేటింగ్‌ ఇచ్చేశాడు. ఇది ఇలా ఉండగా.. తాజాగా విక్టరీ వెంకటేష్‌ .. ఈ సినిమా పై స్పందించారు. ఏ హీరో కూడా సొంతగా సినిమాను హిట్‌ కొట్టలేడని... ఒక సినిమా హిట్‌ వెనుక చిత్ర బృందం సభ్యులు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నారు విక్టరీ వెంకటేష్‌. 

నారప్ప కోసం.. టెక్నిషియన్లు, కెమెరెమెన్లు, డైరెక్టర్ ఇలా కింది స్థాయి నుంచి డైరెక్టర్‌ వరకు అందరూ ఎంతో కష్టపడ్డారన్నారు వెంకటేష్‌. వాళ్లందరూ కష్టపడితేనే... నారప్ప సినిమా హిట్‌ కొట్టిందని చెప్పారు. " ఏ హీరో ఒంటరిగా ఎదగలేడు. నారప్పను శక్తివంతంగా చూపించింది చిత్ర బృందం. వారికి కృతజ్ఞతలు" అంటూ విక్టరీ వెంకటేష్‌ తన ఫేస్‌ బుక్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. కాగా... ఈ సినిమాకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించగా... విక్టరీ వెంకటేష్‌  సరసనగా నటించింది ప్రియమణి.  

మరింత సమాచారం తెలుసుకోండి: