సూపర్‌స్టార్ మహేశ్‌బాబు  కు తెలుగు సిని పరిశ్రమ ఉన్న మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుసు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతున్న హీరోల్లో ఈయన కూడా ఉన్నాడు. పైగా గత కొన్ని సంవత్సరాలుగా మహేశ్ బాబు వరుస ఘన విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈయన గత సినిమాలు అయిన సరిలేరు నీకెవ్వరు, మహర్షి, భరత్ అనే నేను, సుమారు రూ.100 కోట్లకు  పైగా వసూలు చేశాయి. దీంతో మహేష్ అభిమానులు కూడా మహేశ్ బాబు సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు పుట్టినరోజుకు మరో 10రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతోమహేష్ అభిమానులు ఇప్పటి నుంచే సందడి చేయడం మొదలు పెట్టారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.అడ్వాన్స్‌డ్ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు అంటూ హ్యాష్‌ట్యాగ్ లు కూడా ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు.మహేష్ సినిమాలకు సంబంధించి అనేకనేక వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని నిజాలుంటాయి మరియు చాలావరకు అవాస్తవాలు ఉంటాయి . అయితే వచ్చిన విషయం పై ఫుల్ క్లారిటీ వస్తే గానీ అసలు విషయం తెలీదు. ఈలోగా ఆ  విషయాలు తెగ వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఓ వార్త తెలుగు పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించబోయే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడట.

మహేష్ కెరీర్ లో అతడు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.మాటల మాంత్రికుడు పిలవబడే  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అదరగొట్టేసింది.తరువాత వీరి కాంబినేషనులో వచ్చిన మరొక సినిమా ఖలేజా బాగానే అంతగా ఆకట్టుకోలేదు. కానీ మహేష్ నటన త్రివిక్రమ్ డైలాగ్స్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది.అందుకే వీరి కాంబినేషనులో వచ్చే సినిమా కోసం ఆతృతగా ఫాన్స్ ఎదురుచూస్తుంటారు. ఇక వీరి కాంబినేషను తర్వాత ఎప్పటినుంచో మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్న మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా మొదలు కానుంది.డాక్టర్ కె ఎల్ నారాయణ గారు ఈ సినిమాను నిర్మిస్తారు.రాజమౌళి  సినిమా కంటే ముందే రెండు సినిమాలు చేయాలనీ మహేష్ నిర్ణయించుకున్నాడట. రాజమౌళి సినిమా అంటే సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. అందుకే కెరీర్ లో అంత పెద్ద గ్యాప్ రాకూడదని ముందుగానే జాగ్రత్త పడుతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: