టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పిన తక్కువే.ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులని సంపాదించుకొని టాలీవుడ్ అగ్ర హీరోగా దూసుకుపోతున్నాడు.చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా గొప్ప స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా తీయకుండా కేవలం ప్రాంతీయ సినిమాలతోనే మహేష్ ఎనలేని క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ఇక మహేష్ సినిమాలు ప్లాప్ అయినా కాని నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయి.తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ లాగానే మహేష్ మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాడు.ఇక మహేష్ కి సంక్రాంతి సెంటిమెంట్ వుంది. సంక్రాంతికి మహేష్ నుంచి వచ్చిన సినిమాలు మాక్సిమమ్ హిట్లు అందుకుంటాయి. 

ఇక గతేడాది సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా రికార్డ్ స్థాయిలో హిట్ అయ్యి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యింది.అప్పుడప్పుడే స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 280 కోట్ల పైగా వసూళ్లు కొల్లగొట్టి సంక్రాంతి బిగ్గెస్ట్ విన్నర్ గా నిలిచింది.అలాగే మహేష్ అనిల్ కెరీర్ లోనే పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. కథ మామూలుగానే వున్నా మహేష్ కి వున్న క్రేజ్ వల్ల ఈ సినిమా రికార్డు స్థాయిలో హిట్ అయ్యింది. ఇక ఈసారి కూడా సంక్రాంతికే రాబోతున్నాడు సూపర్ స్టార్. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతుంది.ఇక మహేష్ కి పోటీగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి వీరిని కూడా అధిగమించి మహేష్ సంక్రాంతి విన్నర్ అవుతాడో లేదో చూడాలి.ఇక సర్కారు వారి పాట సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: