ఒక భాషకు చెందిన ఇండస్ట్రీలపై ఇతర భాషా నటీనటులు ప్రభావం చూపడం వంటివి చాలా రేర్ గానే జరుగుతుంటాయి. అలా చెప్పుకుంటే తమిళ నటులు రజినీ కాంత్, కమల్ హాసన్ వంటి వారు తమ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు అగ్ర హీరోలకు సమానంగా ఇక్కడ ఆదరణ పొందారు. ఇప్పుడు ఇదే తరహాలో ఓ మలయాళ కుర్ర హీరో తెలుగు సినీ పరిశ్రమలో తన సత్తా చాటుతున్నాడు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరన్నది లేట్ చేయకుండా తెలుసుకుందాం. మలయాళ మెగా స్టార్ గా ప్రఖ్యాతి పొందిన నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ మళయాళంలోనే కాదు, తెలుగులోనూ స్టార్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తెలుగు తెరకు పరిచయమయ్యింది డబ్బింగ్ చిత్రాలతోనే అయినా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఒకే బంగారం, కనులుకనులను దోచాయంటే వంటి సినిమాలతో అభిమానులను పెంచుకుని మహానటి సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్నటువంటి 'కురుప్' అనే చిత్రం పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. శోభితా ధూళిపాళ్ల ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా మనముందుకు రానున్న ఈ చిత్రానికి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటికే తెలుగు వెర్షన్ లో ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయగా రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి