నటించింది అతి తక్కువ సినిమాలు అయినప్పటికీ ‘మాస్ కా దాస్’ అనే బిరుదును ప్రేక్షకుల నుండి సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ దేవరకొండ మాటల తీరును అతడి ప్రవర్తనను అనుసరిస్తూ ఈయంగ్ హీరో తరుచు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.  


ఈ యంగ్ హీరో స్టేజ్ ఎక్కాడు అంటే చాలు అప్పటికప్పుడు తన మనసుకు ఎలా అనిపిస్తే అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన ‘పాగల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతడు చేసిన స్పీచ్ వివాదాస్పదంగా మారడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.

‘పాగల్’ సూపర్ హిట్ అవుతుందని కరోనా కారణంగా మూతపడిన  థియేటర్స్ అన్ని ఈ సినిమాతో ఓపెన్ అయ్యేలా పరిస్థితులు ఏర్పడతాయని కామెంట్ చేసాడు. అంతేకాదు ఈ శనివారంనాడు పబ్బులు బార్లలోనే కాదు సినిమా ఆడే థియేటర్లలో కూడ పార్టీలు జరుగుతాయని విశ్వక్ సేన్ కామెంట్స్ విని చాలమంది ఆశ్చర్య పోతున్నారు.  అదే విధంగా  ‘సర్కస్ లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. నేను అడవికి వెళ్లి ఆడుకుని వచ్చే టైప్. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడ ఓపెన్ అయ్యేలా చేయిస్తా గుర్తుపెట్టుకోండి. సినిమా మామూలుగా ఉండదు. నా పేరు విశ్వక్ సేన్ నేను చెప్పింది తప్పైతే పేరు మార్చుకుంటా’ అని కామెంట్స్ చేసాడు.


ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసిన ఈ  యంగ్ హీరో దయచేసి థియేటర్లలో సీట్లు మాత్రం చింపవద్దని మామూలుగా ఇండియా మొత్తానికి ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 కానీ సినిమా థియేటర్స్ కి మాత్రం ఇండిపెండెన్స్ డే ఆగస్టు 14న అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనితో    ఇతడు మితి మీరిన ఆత్మా విశ్వాసం తో చేసిన కామెంట్స్ దేనికి సంకేతం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఇలా  ఉండగా  విశ్వక్ సేన్ 'పాగల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం  కావడమే కాకుండా మరికొందరు సెటైర్లు వేస్తూ అతడి స్పీచ్ పై ఎన్నో మీమ్స్ కూడ పోస్ట్ చేస్తున్నారు.  ఇండస్ట్రీ హిట్స్ పాన్ ఇండియా సక్సస్ లు  పొందిన హీరోలు కూడ  గతంలో  ఇలాంటి కామెంట్స్ చేయలేదని అలాటిది ఒక హీరోకి ఇంత మితిమీరిన ఇగో ఏమిటి అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: