వెండితెరపై తన నటనతో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న వారందరూ ఇక ఇప్పుడు బుల్లితెరపై కూడా యాంకర్లుగా మారి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెండితెరపై కమెడియన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న అలీ ప్రస్తుతం ఈటీవీలో ఆలీతో సరదాగా అనే కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాడు. ప్రతివారం ఒక సరికొత్త గెస్ట్ ని పిలిచి అటు ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటాడు కమెడియన్ అలీ.


 ఇక ఇటీవలే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన ఆలీతో సరదాగా ప్రోమో ఇటీవలే సోషల్ మీడియా లో విడుదలై  వైరల్ గా మారిపోయింది. ఇక ఈసారి ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా  టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ పాటల రచయితగా కొనసాగుతున్న చంద్రబోస్ వచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబోస్ తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏ ఆర్ రెహమాన్ తనకు సింగిల్ టేక్ సింగర్ అని బిరుదు ఇచ్చారు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రబోస్.  ఏ ఆర్ రెహమాన్ గ్రూప్ లోని ఒక సింగర్ పాట పాడుతున్నాడు. అయితే చరణాలు కరెక్ట్గా రావట్లేదు అని బయట నుంచి చెబుతున్నాను.. ఆ టైం లో మీరు పాడుతారా అని ఏ ఆర్ రెహమాన్ అడిగారు.



 ఇక వెంటనే స్టూడియో లోకి వెళ్లి ఆ పాటను కేవలం 5 నిమిషాల్లో ఎలాంటి టేక్ లేకుండా పాడేసి వచ్చాను. ఆ సమయంలో ఏ ఆర్ రెహమాన్ ఏకంగా ఆశ్చర్యపోయి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మీరు సింగిల్ టేక్ సింగర్ అంటూ ఒక బిరుదు ఇచ్చారు.  ఆ సమయంలో ఎంతో ఆనందంగా అనిపించింది అంటూ చంద్రబోస్ చెప్పుకొచ్చారు. ఇక 12 ఏళ్ల వయసు నుంచే పాటలు రాయడం మొదలు పెట్టాను అని తెలిపారు. ఇక తాను రాసిన మొదటి పాట ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప సింగర్స్ అయిన దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర ఇద్దరు పాడారు అంటూ చెప్పుకొచ్చారు చంద్ర బోస్ .

మరింత సమాచారం తెలుసుకోండి: