లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. లారీ డ్రైవర్ గా ఈ సినిమాలో కనిపిస్తున్న బన్నీ మొదటిసారిగా ఈ రగ్డ పాత్ర పోషిస్తు ఉండడం విశేషం.  విలన్ గా ఫాహద్ ఫజిల్ కనిపిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తూ పోతుండగా క్రిస్మస్ కానుకగా ఈ సినిమా మొదటి భాగాన్ని విడుదల చేయాలనే దిశగా దర్శకనిర్మాతలు పని చేస్తున్నారు.

రెండవ భాగాన్ని మరి కొన్ని రోజుల తర్వాత విడుదల చేస్తారట.  అయితే తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమాకు కొంత బ్రేక్ తీసుకొని వెకేషన్ కు వెళ్ళడం ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది. లాక్ డౌన్ వల్ల పెద్దగా వెకేషన్ కి వెళ్ళలేకపోయినా అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెకేషన్ కు వెళ్లారట.  అక్కడ తన భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పోస్ట్ లను బట్టి తెలుస్తుంది.

ఇటీవలే ఆయన కు సంబంధించిన వెకేషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. స్టార్ హోటల్ లో బ్లాక్ డ్రెస్ లో ఉన్న అల్లు అర్జున్ వెనుక చీకట్లో మెరుస్తున్న దుబాయ్ సిటీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏదేమైనా హిట్ సినిమాలతో టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తన కెరియర్ ను దూసుకు వెళ్లేలా చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే అంతేకాదు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక పుష్ప సినిమా రెండు భాగాలుగా రావడం అభిమానులను ఎంతగానో సంతోషం గా ఉంది. అంతే కాదు అల్లు అర్జున్ రేంజ్ కి పుష్ప లెవెల్ సినిమాలు రావాలని వారు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: