పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్ పెట్టి నటుడి పోసాని తీవ్రమైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.అంతే కాకుండా పంజాబీ అమ్మాయి గురించి కూడా మాట్లాడుతూ రచ్చరచ్చ చేశాడు. ఇదే తంతులో పోసాని తో కలిసి 2010 సంవత్సరం లో ఒక సినిమాను తీసిన నిర్మాత.. సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ పెడుతూ వైరల్గా చేశాడు. ఆ వీడియో దాదాపుగా 13 నిమిషాల పాటు ఉన్నది. ఇందులో పోసాని ని బండ బూతులు తిడుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.


వివరాల్లోకి వెళితే అతని పేరు నల్లం శ్రీనివాస్.. 2010 సంవత్సరం లో పోసాని తో కలిసి "పోసాని జెంటిల్మెన్" అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. దాంతో ఆయన చాలా డబ్బులు పోగొట్టుకున్నట్లుగా తెలియజేశాడు. చిరంజీవి దగ్గర బాగా నమ్మకంతో ఉండడంతో మంచి సినిమా తీయమని చెబితే ఒక ఫ్లాప్ సినిమాలు తీసి అతని చేతిలో పెట్టారు అన్నట్లుగా ఆరోపణ చేస్తున్నారు.

నిజానికి ఆరోజే పోసాని కొట్టాలి అనుకుంటున్నాను కాకపోతే తనని నమ్మి నేనె తప్పు చేశాను అని ఊరుకున్నాను అన్నట్లుగా తెలియజేశాడు. తనకి ఏ రోజున ఇలా లైవ్ ఇచ్చి మాట్లాడాలని ఉద్దేశం లేదన్నట్లుగా తెలియజేశాడు. అంతేకాకుండా నిన్నటి రోజున పోసాని మాట్లాడిన మాటలను చూసి తను ఈ విషయంపై కోపం వచ్చి.. వీడియో వదిలే అన్నట్లుగా తెలియచేశాడు.


సినిమాలు తీసేటప్పుడు ఎంతో మంది అమ్మాయిలను పోసాని ఏం చేశారో తనకు తెలుసు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. వారి పేర్లు చెప్పకూడదని ఉద్దేశంతోనే ఊరుకున్నా అని ఆ వ్యక్తి తెలియజేశాడు. పోసాని ఒక నీతి లేని వెధవని మాట్లాడుతూ.. పవన్ మీద చేసిన వ్యాఖ్యలు విమర్శలు ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ ఆయన తగ్గట్టుగా కౌంటర్లు వినిపించారు.

ఇక పంజాబీ అమ్మాయి గురించి మాట్లాడితే ఆమె వచ్చి పోసాని దగ్గరకు వచ్చి ఏమైనా కంప్లైంట్ చేసిందా అన్నట్లుగా ప్రశ్నించారు. ఒకవేళ పోసాని కి చెప్పి ఉంటే మాట్లాడమని చెప్పు అన్నట్లుగా తెలియజేశాడు. అంతేకాకుండా వాడు మహిళల గురించి మాట్లాడటం సరికాదు అన్నట్టుగా తెలియజేస్తూ. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ మాట్లాడాడు. మిరు కూడా ఈ వీడియో ఒకసారి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: