దీంతో ఈ విషయం పై టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తూ పోసాని కృష్ణ మురళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏకంగా పోసాని కృష్ణ మురళి పై దాడికి యత్నించారని సమాచారం. అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మరోమారు ప్రెస్ మీట్ నిర్వహించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడని తెలుస్తుంది.
ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అని అతడిపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం అస్సలు లేదని స్పష్టం చేశాడని తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుని గుడ్డిగా నమ్ముతున్నాడని అందువల్లనే ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడట పోసాని . అలాగే పవన్ కళ్యాణ్ మంచి కోరే వ్యక్తులలో తాను కూడా ఒకరని అందువల్లనే చంద్రబాబు నాయుడు ని నమ్మవద్దని సూచిస్తున్నట్లు తెలిపాడని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వంపై స్పందిస్తూ చంద్రబాబు నాయుడు మేకవన్నె పులి అని అవకాశం వస్తే ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ని కూడా మోసం చేస్తాడని చెప్పాడట.అలాగే ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి సేవ చేసినటువంటి చాలా మంది సీనియర్ నాయకులను మరియు నాయకురాళ్ళని పార్టీ నుంచి గెంటేశారని అలాగే అతడికి ఉపయోగం లేకపోతే ఎవరిని తన దగ్గర ఉంచుకోడని సంచలన వ్యాఖ్యలు చేశాడని సమాచారం.
అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలలో గెలిచేందుకు మాటల యుద్ధం నిర్వహించాడని ఇందులో భాగంగా కొంత మంది తమ పార్టీ నాయకుల చేత మెగాస్టార్ చిరంజీవి మరియు అతడి కుటుంబ సభ్యులను దారుణంగా తిట్టించాడని చెప్పాడట పోసాని.ఆ విషయం పవన్ కళ్యాణ్ మర్చిపోయిన ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మంచి కోరే వ్యక్తిగా తాను మాత్రం ఇప్పటివరకు మర్చిపోలేదని చెప్పుకొచ్చాడని సమాచారం. వైయస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తిని అంతేకాకుండా రాష్ట్రానికి మంచి చేయడం కోసం చాలా బాధ పడుతున్నాడని అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సరి కాదని పవన్ కళ్యాణ్ కి సూచించాడని తెలుస్తుంది. అయితే ఉన్నట్లుండి పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి