పాన్
ఇండియా హీరో అయిన తర్వాత
ప్రభాస్ వరుస చిత్రాలతో దూసుకుపోతూ అందరిని ముక్కు మీద వేలు వేసుకునేలా చేస్తున్నాడు.
బాహుబలి సినిమా తరువాత
ప్రభాస్ ఆషామాషి సినిమాలు చేసే స్థాయిలో లేడు. భారీ తనం, వందల కోట్ల బడ్జెట్ లు వివిధ భాషలలో విడుదలయ్యే సినిమాలను మాత్రమే ఆయన ఎంచుకుంటున్నాడు. అంత పెద్ద భారీ చిత్రాల చేయడం అంటే సమయం బాగానే పడుతుంది అని ప్రేక్షకులు అనుకున్నారు కానీ వాటన్నిటినీ
ప్రభాస్ చేస్తూ మళ్లీ కొత్త సినిమాలు ఒప్పుకోవడం ప్రేక్షకులను ఎంతగానో సంతోషపెడుతుంది.
ఇంత పెద్ద భారీ భారీ భారీ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ
ప్రభాస్ నెమ్మదిగా అడుగులు వేయలేదు. ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. ఆయన హీరోగా చేసిన రాధేశ్యామ్ చిత్రం విడుదల కాకముందే మూడు భారీ పాన్
ఇండియా సినిమాలను ఆయన ప్రకటించాడు. ఆ మూడు సినిమాలు కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ఒకేసారి మూడు సినిమాల్లో నటించడం అంటే అంత మామూలు విషయం కాదు. అందులోనూ అవి పాన్
ఇండియా సినిమా లు. రాధే
శ్యామ్ విడుదల సంక్రాంతికి ఉంది. సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఆది పురుష్ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. మరోవైపు
నాగ్ అశ్విన్ కూడా ప్రాజెక్ట్ కి సినిమాను స్టార్ట్ చేశాడు.
ఇలా మూడు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటు ఉండగా ఈ విధంగా భారీ భారీ చిత్రాలను చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఇది చాలదు అన్నట్లు మరొక సినిమాను కూడా అనౌన్స్ చేస్తున్నాడు. హీరోలందరూ
ప్రభాస్ స్పీడ్ ను చూసి ఆశ్చర్య పోతున్న నేపథ్యంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా
ప్రభాస్ సినిమాలు ఎలా చేసుకుంటూ పోతున్నాడు అంటున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. రాధే
శ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత థియేటర్ల సందడి చేస్తున్న
ప్రభాస్ కు ఈ
సినిమా ఏ రేంజ్ హిట్ అందిస్తుందో చూడాలి.