బిగ్బాస్ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరి కన్ను కూడా ఈ కార్యక్రమం పైనే ఉంది. ఒకసారి బిగ్ బాస్ స్టార్ట్ అయింది అంటే చాలు ఇక వంద రోజుల పాటు బుల్లితెరపై చేసే రచ్చ అంతా ఇంతా కాదు.  మనకు తెలిసిన సెలబ్రిటీలు ఎప్పుడూ తెర పై ఎంతో హుందాగా కనిపిస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో ఎలా ఉంటారు అనేది మాత్రం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. కానీ బిగ్ బాస్ అనే కార్యక్రమం ద్వారా తెలిసిన సెలబ్రిటీల గురించి తెలియని విషయాలను తెలుసుకునేందుకు బుల్లితెర ప్రేక్షకులందరికీ అవకాశం వచ్చింది అని చెప్పాలి.  అందుకే బిగ్బాస్ మొదలయింది అంటే చాలు సినీ సెలబ్రిటీల అసలు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే దానిపై అందరూ ఆసక్తిగా రోజు షో వీక్షించడం లాంటివి చేస్తూ ఉంటారు.



 ఇకపోతే అటు బిగ్ బాస్ లో ప్రతి సోమవారం నామినేషన్స్ ఇక ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్..  కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు ఎప్పటికప్పుడు ఊహించని రీతిలో ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంటాయ్. ఇక వారాంతంలో నాగార్జున వచ్చి చేసే సందడి అయితే మామూలుగా ఉండదు అని చెప్పాలి.  ఇక నిన్న నాగార్జున వచ్చి హౌస్ లో  కంటెస్టెంట్స్ అందరికీ వార్నింగ్ కూడా ఇవ్వడం చేసాడు.  ఇక ఈ రోజు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే నిన్న నాగార్జున వచ్చిన ఎపిసోడ్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కొండపొలం సినిమా చిత్రబృందం ప్రమోషన్ కోసం వచ్చింది.



 ఇకపోతే నేడు బిగ్ బాస్ ఎపిసోడ్ మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  దసరా పండుగ బిగ్బాస్ స్టేజి మీద సెలబ్రేట్ చేశారు.  నాగార్జున పంచ కట్టుకుని బంగార్రాజుగా స్టేజి మీదికి ఎంట్రీ ఇచ్చాడు. ఇక నాగార్జున గెటప్ చూసి అందరు షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత నాగార్జున తనయుడు అఖిల్ హీరోయిన్ పూజా హెగ్డే తో కలిసి బిగ్బాస్ స్టేజ్ మీదకి వస్తాడు. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలా అఖిల్ బిగ్బాస్ స్టేజి మీదికి ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ తర్వాత పూజా హెగ్డే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అంతలోనే కల్పించుకున్న మానస్ మీరు అంత క్యూట్ గా మాట్లాడకండి అంటూ చెప్పడంతో పూజా హెగ్డే నవ్వేస్తుంది.  ఇటీవల విడుదలైన ప్రోమో కాస్తా అందరినీ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: