పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో అదరగొట్టారు. ఆయన భీమ్లా నాయక్ మూవీ వెయిటింగ్ ఫర్ రిలీజ్. ఇక హరిహర వీరమల్లు మూవీ సెట్స్ మీద ఉంది. ఇవి కాకుండా చాలా సినిమాలు పవన్ చేతిలో ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఎస్ అంటే చేసేందుకు మరింత మంది ప్రొడ్యూసర్స్ కూడా లైన్ లో ఉన్నారు.

ఇలా ఇంతటి బిజీ ఉన్నా కూడా ఎందుకో పవన్ మనసు ఒక్కసారిగా రాజకీయాల మీద మళ్ళింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ రెండు మూడు సినిమాలు మాత్రం చేసి మళ్ళీ  విరామం ప్రకటిస్తారు అని టాక్ నడుస్తోంది. దానికి కారణం ఏపీలో పాలిటిక్స్ చేయడానికి ఆయనకు టైమ్ సరిపోవడంలేదుట. దాంతో ఆయన మూవీస్ తగ్గించుకుని అయినా రానున్న రెండున్నరేళ్ల కాలాన్ని విలువగా వాడుకోవాలని చూస్తున్నారుట.

వచ్చే ఎన్నికలు అటు జనసేన‌కు కీలకం అని చెప్పాలి. ఇప్పటికి ఏడేళ్లు అయింది పార్టీ పెట్టి. మరో మూడేళ్లలో పదేళ్లు పూర్తి అవుతాయి. ఆనాటికి కూడా పార్టీని ముందుకు తీసుకురాకపోతే ఇబ్బందులు తప్పవని వస్తున్న సూచనల మేరకు పవన్ సినిమాలు తగ్గించుకుంటారు అంటున్నారు. ఇక పవన్ చేయాల్సిన సినిమాల లిస్ట్ చూస్తే బండ్ల గణేష్ కి ఒక సినిమా ఉంది. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కి కూడా మూవీ చేయాలి. అదే విధంగా వకీల్ సాబ్ డైరెక్టర్ తో మరో మూవీ ఉందని చెబుతారు. డైనమిక్ డైరెక్టర్ సురెనద్రరెడ్డి తోనూ పవన్ చేయాలి అంటున్నారు. ఇవన్నీ కూడా పవన్ కనుక బ్రేక్ అంటే మాత్రం వాయిదా పడతాయి అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ సినిమాల లిస్ట్ చూసి ఆనందిస్తున్న ఫ్యాన్స్ కి ఇది కొంచెం చేదు వార్తే అనుకోవాలి. అయితే పవన్ రాజకీయ తెర మీద రియల్ లైఫ్ లో ఎదురుగా కనిపిస్తారు కాబట్టి అభిమానులు మరింత ఫుల్ జోష్ తో  ఉంటారని అనుకోవాలి. ఏది ఏమైనా పవన్ నిర్ణయం కనుక నిజం అయితే టాలీవుడ్ లో ఆయన నిర్మాతలకు మాత్రం ఇబ్బందే అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: