తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సీనియర్ భామ అయిన కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుందని సమాచారం.


ఇటీవల పెళ్లి అయిన కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుందంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చనీ తెలుస్తుంది.. అయితే ఇప్పుడు కొత్తగా నిర్మాతగా అవతారమెత్తిందని తెలుస్తుంది కాజల్ అగర్వాల్.కొత్త హీరోతో తన నిర్మాణ సంస్థలో మూవీ స్టార్ట్ చేసిందట కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నట్లు సమాచారం.


 


సౌత్ లోని అన్ని భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కాజల్ నటించి మెప్పించిందని అందరికి తెలుసు.గత సంవత్సరం ముంబైకి చెందిన బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుందనీ ఆమె అభిమానులు తెగ ఆనందపడ్డారు. అలాగే కొందరు కాజల్ కి అప్పుడే పెళ్లి అవుతుందా అంటూ బాగా భాధ పడ్డారని తెలుస్తుంది.పెళ్లి తర్వాత కూడా సినిమాలు వరుసగా చేస్తూనే ఉందనీ ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్నారనీ అందరికి తెలిసిన విషయమే.ఇప్పుడు అదే కోవలో ఈ చందమామ కూడా చేరిందనీ తెలుస్తుంది.కాజల్ అగర్వాల్ ఒక పక్క సినిమాలు చేస్తూ అలాగే మరో పక్క భర్త బిజినెస్ ని కూడా చూస్తూ ఇప్ప్పుడు నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించిందని తెలుస్తుంది.


ప్రముఖ నిర్మాత అయిన రాజ్ కందుకూరి కుమారుడు హీరోగా రెండో సినిమా ప్రారంభమైందనీ తెలుస్తుంది.ఆ సినిమా పేరు 'మను చరిత్ర'. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల అయిందనీ తెలుస్తుంది. ఈ సినిమాని మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించారట కాజల్ అగర్వాల్. ఆపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేరుతో కాజల్ అగర్వాల్ ఈ సినిమాని సమర్పిస్తుందనీ తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమా విడుదల అవ్వబోతుందనీ తెలుస్తుంది.. ఇందులో హీరోయిన్ గా మేఘ ఆకాష్ నటిస్తుండగా ఇకపై భవిష్యత్తులో కూడా నిర్మాతగా మరిన్ని సినిమాలు నిర్మిస్తానని కాజల్ తెలిపినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: