క్రితం వారం విడుదలైన నాగశౌర్య ‘వరుడు కావలెను’ మూవీకి చెప్పుకోదగ్గ పాజిటివ్ టాక్ రానప్పటికీ ఆమూవీలోని సంభాషణలు బాగున్నాయి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈచిత్రంతో మాటల రచయితగా గణేష్ రావూరి అయ్యారు. ఈ సినిమా చాల స్లోగా ఉంది అన్న కామెంట్స్ వచ్చినప్పటికీ గణేష్ రావూరి సంభాషణలకు మాత్రం మంచి పేరు వచ్చింది. గతంలో ఈయన ‘సోలో బ్రతుకే సో బెటర్ తో పాటు’ ఒకట్రెండు చిత్రాలకు డైలాగ్స్ టీమ్ లో పనిచేసాడు.
ఇతడి ప్రతిభను గుర్తించిన నిర్మాత నాగ వంశీ అతడిని పిలిచి ‘వరుడు కావలెను’ సినిమాకు డైలాగ్స్ వ్రాయమని కోరినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో డైలాగ్స్ బాగున్నప్పటికీ ఈ సినిమా అంతంత మాత్రంగ విజయం సాధించడంతో గణేష్ రావూరి కి పెద్ద పేరు రాకపోయినా ఈ డైలాగ్స్ విన్నవారు మాత్రం ఇండస్ట్రీకి మరో జూనియర్ త్రివిక్రమ్ దొరికాడు అంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ కామెంట్స్ గణేష్ రావూరి దృష్టి వరకు వెళ్ళడంతో తన డైలాగ్స్ ను త్రివిక్రమ్ స్థాయిలో పోలుస్తూ కామెంట్స్ చేయడం తన అదృష్టం అని అంటున్నారు.
అంతేకాదు ‘వరుడు కావలెను’ సినిమా మాటలకు వస్తున్న స్పందనతో తనకు అనేకమంది దర్శకుల నుంచి ఫాన్స్ వస్తున్నాయని ఆనంద పడుతున్నాడు. అయితే తనకు ఎవరైనా అవకాశం ఇస్తే ఒక టాప్ హీరో సినిమాకు సంభాషణలు వ్రాయాలి అన్న కోరిక కల్గుతోందని అయితే ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తనకు తెలియదు అని అంటున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి