దీనితో కరోనా భయాలతో ఇంకా జనం ధియేటర్లకు రావడం లేదా లేదంటే ఓటీటీ సినిమాలకు అలవాటుపడిపోయారా అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది. కొన్ని చిన్న సినిమాలకు టాక్ బాగా వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఆసినిమాల వైపు చూడలేదు. దీనితో ఈ నెలాఖరి వరకు విడుదలకు లైన్ లో ఉన్న చిన్న మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి ఏమిటో అర్థం కాని విషయంగా మారింది.
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోల సంఖ్య 10 నుంచి 15 వరకు ఉంటుంది. వారికి 10 కోట్ల వరకు పారితోషికాలు కూడ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కలక్షన్స్ లేకపోతే వారి పరిస్థితి అయోమయంలో పడిపోయి వారి మార్కెట్ కూడ పూర్తిగా పడిపోయే ఆస్కారం ఉంది. దీపావళికి విడుదలైన భారీ తమిళ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి.
అయితే కొండంత ఆశను రేపుతూ బాలీవుడ్ లో దీపావళికి వచ్చిన ‘సూర్య వంశీ’ మూవీకి భారీ కలక్షన్స్ వస్తున్నాయి. దీనితో టాలీవుడ్ కు చెందిన భారీ సినిమా నిర్మాతలు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నా తమిళనాడులో దీపావళికి వచ్చిన రజినీకాంత్ విశాల్ సినిమాల పరిస్థితి చూసి ఖంగారు పడుతున్నారు. డిసెంబర్ లో ప్రారంభం అయ్యే పెద్ద సినిమాల హవా ప్రారంభం అయ్యే వరకు తెలుగులో కనీసం 20కి పైగా మీడియం చిన్న సినిమాలు విడుదల కావలసి ఉంది. ఇలాంటి పరిస్తితులలో ప్రేక్షకులు భారీ సినిమాలు కూడ బాగుంటే మాత్రమే ధియేటర్లకు వచ్చే పరిస్థితులలో రానున్న రోజులలో చిన్న మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ అనేక చర్చలు జరుగుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి