'బంగార్రాజు' సినిమా కూడా సెట్స్‌కి వెళ్లడానికి 4 ఏళ్లు ఎదురుచూసింది. 'సోగ్గాడే చిన్ని నాయనా' ప్రీక్వెల్‌గా మొదలైందీ సినిమా. ఇక 'సోగ్గాడు' సంక్రాంతికి వచ్చాడు కాబట్టి, నాగార్జున 'బంగార్రాజు'ని కూడా పొంగల్‌కే దింపాలనుకున్నాడు. కానీ హెవీ కాంపిటీషన్‌తో ఈ డెసిషన్‌ని మార్చుకున్నాడు. భార్యా బాధితుల కాన్సెప్ట్‌తో అనిల్‌ రావిపూడి తీసిన సూపర్ హిట్‌ మూవీ 'ఎఫ్2'. వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్‌గా 'ఎఫ్3' తెరకెక్కుతోంది. ఇక 'ఎఫ్2' మూవీ 2019 సంక్రాంతికే రిలీజ్‌ అయి మంచి వసూళ్లు అందుకుంది. దీంతో 'ఎఫ్3'ని కూడా ఈ సంక్రాంతికి రిలీజ్‌ చెయ్యాలనుకున్నారు. కానీ కాంపిటీషన్‌తో ఓపెనింగ్స్ డివైడ్ అవుతాయని ఈ మూవీని ఫిబ్రవరి 25న రిలీజ్‌ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ స్టైలిష్‌ స్టార్‌ ఇమేజ్‌ని పక్కనపెట్టి రగ్గడ్‌లుక్‌తో చేస్తోన్న సినిమా 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాని క్రిస్మస్‌కి రిలీజ్‌ అవుతుందనే టాక్ వచ్చింది. కానీ 'ట్రిపుల్ ఆర్'తో జనవరి 7 నుంచే సంక్రాంతి మొదలవుతోందని, మినిమం 2 వీక్స్‌ గ్యాప్‌ కావాలని డిసెంబర్‌ 17నే బరిలో దిగుతున్నాడు సంక్రాంతి బరిలో ఇప్పటికే ఇద్దరు మెగాహీరోలు ఉన్నారు. రామ్‌ చరణ్‌ 'ట్రిపుల్‌ ఆర్'తో వస్తోంటే, పవన్‌ కళ్యాణ్‌ 'భీమ్లా నాయక్' రిలీజ్‌ చేస్తున్నాడు. ఫిబ్రవరి 4న థియేటర్లలోకి వస్తున్నాడు 'ఆచార్య'.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అనగానే ఎన్.బి.కె. ఫ్యాన్స్‌కి బోల్డంత ఎనర్జీ వస్తుంది. 'సింహా, లెజెండ్' తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న 'అఖండ' సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. డిసెంబర్‌లోనే ఈ మూవీని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట మేకర్స్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున లాంటి హీరోలంతా సంక్రాంతిని వదిలేస్తోంటే రాజశేఖర్ మాత్రం శేఖర్‌ సినిమాని సంక్రాంతికి దింపాలనుకుంటున్నాడట. చూద్దాం.. సంక్రాంతికి వచ్చే టాప్ హీరోల సినిమాలు ఏవి బాక్సాఫీస్ బద్దలు కొడతాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: