తెలంగాణ ఐపీఎస్ మరియు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దెబ్బకు ర్యాపిడో సంస్థ అబ్బా అందని తెలుస్తుంది.ఈ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఇచ్చిన వార్నింగ్ కు అల్లు అర్జున్ దిగివచ్చాడని తెలుస్తుంది.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎట్టకేలకు తన పంతాన్ని నెరవేర్చుకున్నారని తెలుస్తుంది.. రెండు రోజుల కిందట ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ర్యాపిడోకు మరియు అల్లు అర్జున్ కు ఆర్టీసీని అవమానించేలా ప్రకటన చేసినందుకు నోటీసులు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. మొదట్లో ససేమిరా అన్న ర్యాపిడో సంస్థ తాజాగా సజ్జనార్ దెబ్బకు కిందకు దిగివచ్చిందని తెలుస్తుంది.


తెలంగాణ ఆర్టీసీ సిటీ బస్సును ఉపయోగించుకొని యాడ్ లో చిత్రీకరించిన సన్నివేశాలను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుందట ర్యాపిడో సంస్థ. ఈ మేరకు ర్యాపిడో సంస్థ అధికారికంగా ప్రకటన చేసిందని తెలుస్తుంది.

ఇటీవల బైక్ మరియు ట్యాక్సీ రైడింగ్ సంస్థ 'ర్యాపిడో' యాడ్ లో ప్రముఖ టాలీవుడ్ అగ్రహీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించాడని తెలుస్తుంది.. ఈ ప్రకటనలో 'ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని ర్యాపిడో చాలా వేగంగా మరియు సురక్షితంగా ఉంటాయని అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని' ప్రకటనలో అల్లు అర్జున్ అన్నాడని తెలుస్తుంది..

ఈ ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భగ్గుమన్నారని తెలుస్తుంది.. ఈ యాడ్ పై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారని తెలుస్తుంది.. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను తక్కువ చూపడాన్ని సజ్జనార్ ఖండించారని తెలుస్తుంది.టీఎస్ ఆర్టీసీని కించపరడాన్ని ఉద్యోగులు, ప్రయాణికులు, సంస్థ సహించదని.. సమాజం కోసం ప్రజారవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలని సజ్జనార్ హితవు పలికారని తెలుస్తుంది. అందుకే ఇందులో నటించిన అల్లు అర్జున్ కు మరియు ప్రకటనను ప్రసారం చేసిన 'ర్యాపిడో' సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు సజ్జనార్ సంచలన ప్రకటన చేశారని సమాచారం..

ఈ క్రమంలోనే ర్యాపిడో సంస్థ వెనక్కి తగ్గిందని తెలుస్తుంది.ఆర్టీసికి క్షమాపణలు చెప్పిందని సమాచారం.దీంతో సజ్జనార్ దెబ్బకు అటు ర్యాపిడో సంస్థ అల్లు అర్జున్ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: