సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తున్నాడు. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి త్రివిక్రమ్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మేకింగ్లో దర్శకుడు సాగర్ కేంద్ర నామ మాత్రంగానే ఉన్నట్లు కనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ కోసం ఒరిజినల్ కథను తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేశారు త్రివిక్రమ్.

ఈనేపథ్యంలోనే మలయాళ క్లాసికల్ హిట్ ని కమర్షియల్గా మార్చేశారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల మధ్య సాగే ఆధిపత్య పోరే భీమ్లా నాయక్ సినిమా. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ వార్త బయటికొచ్చింది. అదే ఈ సినిమాకి త్రివిక్రమ్ తీసుకున్న రెమ్యూనరేషన్. నిర్మాతలు ఈ సినిమాకి గాను త్రివిక్రమ్కి ఏకంగా 15 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారట. అంతేకాదు రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాల్లో కొంత పర్సంటేజ్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం సినిమాకి దర్శకత్వం వహిస్తే వచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా త్రివిక్రమ్ ఈ సినిమాకి తీసుకోవడంతో ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది.

 ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే వారిలో రాజమౌళి మినహాయిస్తే ఏ ఒక్క డైరెక్టర్ కూడా 15 కోట్ల రూపాయలకు మించి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. అలాంటిది ఇప్పుడు త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమా ద్వారా అంతకుమించి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటే భీమ్లా నాయక్ లో త్రివిక్రమ్ మార్క్ కచ్చితంగా చూడవచ్చు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతున్న మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇటీవల ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు మాత్రం ఈ సినిమాని వాయిదా వేయాలని భీమ్లా నాయక్ నిర్మాతలకు ఒత్తిడి చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: