ప్రస్తుతం బుల్లితెరపై బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీల షో గా కొనసాగుతుంది బిగ్బాస్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా కొంతమంది సినీ సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి ఇక 100 రోజులపాటు వారితో గేమ్ ఆడిస్తూ ఉంటారు. ప్రతివారం ఒకరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో అందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీలు ఉండడంతో ఇక నిజ జీవితంలో సినీ సెలబ్రిటీలు ఎలా ఉండబోతున్నారు అని తెలుసుకోవడానికి అందరూ ఎక్కువగా ఈ షో చూడటానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే బిగ్బాస్ కార్యక్రమము దాదాపు అన్ని భాషలలో కూడా ఎంతగానో సక్సెస్ సాధించింది.


 ఇక ప్రస్తుతం అటు తెలుగు బుల్లితెర పై కూడా ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది.  కొన్ని నెలల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. చూస్తూ చూస్తుండగానే ఏకంగా వంద రోజులకు దగ్గర పడుతుంది బిగ్బాస్ కార్యక్రమము. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడు మంది  కంటెస్టెంట్స్ ఉన్నారు. ఏడు మంది కంటెస్టెంట్ లో టాప్ ఫైవ్ లో ఎవరు నిలవ పోతున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా ఇక ఫైనల్ కి ముందు టికెట్టు ఫినాలే అంటూ ఒక టాస్క్ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. గెలిచినవారు డైరెక్టుగా ఫైనల్ చేరుకుంటారు.


 ఈ క్రమంలోనే ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్టు ఫినాలే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ ఎంతో కష్టంగానే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా ఒక టబ్లో పూర్తిగా ఐస్ ముక్కలు వేస్తారు ఇక ఆ ఐసు ముక్కల్లోనే ఏడుగురు కంటస్టెంట్స్ కూడా నిలబడాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో ఎవరు విజయం సాధిస్తే వాళ్ళు నేరుగా టిక్కెట్టు ఫినాలే సొంతం చేసుకుంటారు. అంటే ఫైనల్కు వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే ఇటీవల నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల సోషల్ మీడియాలో విడుదలై  వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: