ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న అమ్మాయి పేరు సుజాత. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈమె రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం 2 లో పోలీసు ఆఫిసర్ పాత్రల్లో కనిపించి మనల్ని మెప్పించింది. వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాకి వచ్చిన సీక్వెల్ నే ఈ మూవీ దృశ్యం 2. అమెజాన్ ప్రైమ్‌‌లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ యాక్టింగ్ కు అందరు ఫిదా అయ్యారు. కన్న కూతురిని కాపాడటానికి వెంకటేష్ చేసిన తప్పులు.. ఆ తప్పులను పోలీసులు సైతం కనుకోనివ్వకుండా ఫ్యామిలీ మొత్తం చేసిన డ్రామ హైలెట్ గా నిలిచింది.

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తుందో ఈ సినిమాలో మనం చూడవచ్చు. ఈ సినిమా సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఆశీర్వాద్‌ సినిమాస్‌ నిరించారు. ఇక  ఈ మూవీలో సుజాత మనకు సరిత అనే పాత్రలో కనిపిస్తుంది. ఇంటి పక్కనే ఉంటున్న అమ్మాయిగా సరిత ..మీనాను నమ్మించి అసలు ఆ వరుణ్ మర్డర్ ఎలా చేసారు..ఎవరు చేసారు.. ఆ శవన్ని ఏం చేసారు అని రాబడుతుంది. ఇక ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.  దీంతో ఈమె గురించి గూగుల్ లో సెర్చింగ్ లు చేస్తున్నారు. ఆమె ఎవరు..ఎన్ని సినిమాల్లో నటించింది, పెళ్లి అయ్యిందా..ఇలాంటి ప్రశ్నలకు జవాబు వెతుకుతున్నారు కుర్రాళ్లు.

 2002లో ప్లస్ 2 అనే తమిళ మూవీతో సుజాత సినీ ఇండస్ట్రీకు పరిచయమైంది. ఇక ఆ సినిమా తో ఆకట్టుకున్న ఈమె ఆ తరువాత తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించి మచి పేరు సంపాదించుకుంది. ఈమె ఇది వరకే ఓ సారి  వెంకటేష్ సినిమాలో చిన్న పాత్రల్లో మెరిసింది. వెంకీ హీరోగా వచ్చిన నాగవల్లి సినిమా గుర్తుంది కదా..ఆ సినిమాలో  హేమ అనే చిన్న రోల్ చేసి మనల్ని మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ కనిపించిన సుజాత గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, అలీ బాబా ఒక్కడే దొంగ సినిమాల్లో కూడా కనిపించింది.  అంతేకాదు 2017లో  బిగ్ బాస్ లో కి వెళ్లి సుమారు 90 రోజులు హౌస్ లోనే ఉండి తనదైన స్టైల్లో ఆట ఆడి ఎలిమినేట్ అయింది. ఇక ఈమె భర్త పేరు  శివాజీ దేవ్. ఈయన కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటుడే. వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించిన ఈమెకి రాని పేరు దృశ్యం 2 సినిమా ద్వారా వచ్చింది. ప్రస్తుతం అమ్మడు 2 తెలుగు సినిమాలు , 4 తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: